Kurnool News: ఉగాది వేడుకలు ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. కల్లూరు మండలంలో ఉగాది ప్రభలు ఊరేగిస్తున్న టైంలో జరిగిన ప్రమాదం 15 మంది చిన్నారుల ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. ప్రభలు ఊరేగిస్తున్న టైంలో విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మది చిన్నారుల గాయపడ్డారు. వారిని హుటాహుటిన కర్నూలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Continues below advertisement




కర్నూలు జిల్లా సమీపంలోని చిన్నటేకూరులో విద్యుత్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. ఉగాది ఉత్సవాల సందర్భంగా గ్రామంలో రథోత్సవం జరుగుతోంది. రథం లాగుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. రథంపై ఉన్న చిన్నారులకు కరెంట్ షాక్ కొట్టడంతో వారంతా కిందపడిపోయారు. 




ప్రమాదంలో గాయపడిన చిన్నారులను స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ అపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా కరెంటు తీయకుండా రథం లాగడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ప్రమాదం జరగడం  ఒకసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అస్వస్థకు గురైన చిన్నారులను స్థానిక ప్రభుత్వాసు తరలించారు ప్రమాదంలో అస్వస్థకు గురైన చిన్నారులను నంద్యాల టిడిపి పార్లమెంట్ అభ్యర్థి శబరి పరామర్శించారు.