కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలోని పాశర్లపూడి గ్రామ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. తమ బడిని హైస్కూల్‌లో విలీనం చేయడంపై మండిపడుతున్నారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో విలీనం చేయడంపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ స్కూలూ వద్దు మా స్కూలే మాకు ముద్దంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. గంటల పాటు గోడ కుర్చీ వేశారు. చాలా ఇబ్బందులు పడుతూనే నిరసన తెలియజేశారు. విద్యార్థుల ఆందోళన సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రైమరీ పాఠశాలను హై స్కూల్‌లో విలీనం చేయడంపై వారు కూడా ఆందోళన చేశారు.
హైస్కూల్‌కి వెళ్లాలంటే ఎన్.హెచ్ 216 రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను ఆ దారి వెంట పంపడం కంటే ఇంట్లోనే ఉంచుకోవడం మేలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పిల్లలను హై స్కూల్‌కు పంపబోమని చెప్పారు. కావాలంటే అప్పోసప్పో చేసైనా సరే ప్రైవేటు పాఠశాలకే పంపిస్తామని తెలిపారు. పిల్లల బాగోగుల గురించి ఏం ఆలోచించకుండా ప్రైమరీ పాఠశాలను హై స్కూల్ లో ఎలా కలుపుతారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అసహనం వ్యక్తం చేశారు.
ప్రైవేటు బడికైనా పంపుతాం..
-
ఏ బడీ వద్దు.. మా బడే ముద్దు అంటున్న పిల్లలు..
తల్లిదండ్రుల మాటలు విన్న విద్యార్థనీ, విద్యార్థులు తమకు ఏ బడీ వద్దని చెప్పారు. రోడ్డుపై నడుస్తూ హై స్కూల్ కు వెళ్లలేమని అలాగే ప్రైవేటు పాఠశాలలో చదవడం కూడా తమకు ఇష్టం లేదని చెబున్నారు. అక్కడే తమ బడిని కొనసాగించాలని కోరతున్నారు.