Chiru In Modi Meeting : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఏపీలో జ‌ర‌ప‌నున్న ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనాలని టాలీవుడ్ అగ్ర న‌టుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని  కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఆహ్వానించారు.   ఈ నెల 4న ఏపీకి రానున్న మోదీ... ఆజాదీ అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా భీమ‌వ‌రంలో జ‌ర‌గ‌నున్న మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హాన్ని మోదీ ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపుతున్నారు. అందులో చిరంజీవి కూడా ఉన్నారు. అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంతి వేడుక‌లను ఈ నెల 27 నుండి ప్రారంభింారు.  వచ్చే నెల 4 వరకు 8 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


" జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 4వ తేదీన ఆం  భీమవరంలో స్ధానిక ఏఎస్సార్ పార్కులో ఏర్పాటు చేస్తున్న 30 అఢుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జూలై 3న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఆ- రాత్రికి అక్కడే బస  చేసి జులై 4 ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం గం.10-50కి భీమవరం చేరుకుంటారు. అక్కడ అల్లూరి సీతారామరాజు  విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసగింస్తారు.  అనంతరం విజయవాడ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలు దేరి వెళతారని అధికార వర్గాలు  వెల్లడించాయి.


వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ! సొంత నేతలపైనే కుట్రలు జరుగుతున్నాయా ?


ప్రధాని పర్యటనలో చిరంజీవి కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించరని భావిస్తున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమం కావడంతో ఆయన హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ కూడా పాల్గొంటారు. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి కిషన్ రెడ్డి స్వయంగా ఆహ్వానం పంపినందున కే చిరంజీవి ఖచ్చితంగా ఆహ్వానాన్ని అంగీకరిస్తారని అంచనా వేస్తున్నారు.