AP Telangana Breaking News: నోవాటెల్ హోటల్ లో జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 27 Aug 2022 07:49 PM
Background
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ జోన్‌ను పునర్విభజన చేశారు. శంషాబాద్ జోన్ ను రెండు జోన్లుగా విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఉన్న శంషాబాద్ జోన్‌ను రెండుగా విభజించి, కొత్తగా...More
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ జోన్‌ను పునర్విభజన చేశారు. శంషాబాద్ జోన్ ను రెండు జోన్లుగా విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఉన్న శంషాబాద్ జోన్‌ను రెండుగా విభజించి, కొత్తగా రాజేంద్రనగర్ జోన్‌ను ఏర్పాటు చేశారు. దాంతో ఇకనుంచి రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లుగా సేవలు అందించనున్నాయి. ప్రభుత్వం విభజించిన ప్రకారం ఈ కొత్త జోన్ రాజేంద్రనగర్ లో చేవెళ్ల, రాజేంద్రనగర్ డివిజన్లు ఉంటాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ తెలంగాణ ప్రభుత్వానికి శంషాబాద్ జోన్ పునర్ విభజనపై రిపోర్ట్ అందించారు. దీనికి సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌ను శంషాబాద్, రాజేంద్ర నగర్ రెండు జోన్లుగా విభజించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ కావడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 31 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 24, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు నమోదైంది. పశ్చిమ దివ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆగస్టు 31 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.బులియన్ మార్కెట్‌లో గత వారం తగ్గిన బంగారం ధరలు ఈ వారం పెరుగుతున్నాయి. ధర తగ్గడంతో ఇటీవల బంగారం కొనుగోళ్లు పెరిగాయి. తాజాగా వరుసగా మూడోరోజు పసిడి ధర ఎగబాకింది. పసిడి బాటలోనే వెండి పయనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో రూ.160 మేర పెరగడంతో ఇక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,980 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉంది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర నేడు రూ.61,300గా ఉంది. నేడు రూ.200 మేర ధర పెరిగింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,980 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉంది. ఈ పట్టణాల్లో వెండి నేడు వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.ఏపీలో బంగారం ధరలు.. ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 27 August 2022) 10 గ్రాముల ధర రూ.52,980 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉంది. రూ.200 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నోవాటెల్ లో జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ
Hero Nithin : హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ అయ్యారు. తెలంగాణ పర్యటనలో ఉన్న జేపీ నడ్డా శనివారం ఉదయం మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తో సమావేశం అయ్యారు.