Janasena : జనవరి 12 న శ్రీకాకుళం జిల్లా లో రణస్థలం వద్ద నిర్వహించే యువశక్తి కార్యక్రమంలో వంద మందికిపైగా యువతకు మాట్లాడే అవకాశం ఇస్తామని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన  జనవరి 12 న మధ్యాహ్నం  12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుదంని ప్రకటించారు.  ఉత్తరాంధ్ర యువత,మత్స్యకారుల సమస్యలపై  యువశక్తి కార్యక్రమంలో చర్చ జరుగుతుదంన్నారు.  బాధ్యత గల ప్రతిపక్షం గా జనసేన చేస్తున్న కార్యక్రమాల్ని కూడా ప్రభుత్వం దుర్మార్గం గా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని.. మండిపడ్డారు. డీజీపీ కి ఇప్పటికే యువ శక్తి కార్యక్రమం గురించి తెలియజేశామన్నారు. 


ప్రతిపక్షాల సభలకు జగన్ ఎందుకు భయపడుతున్నారు ?


దాదాపు 100మంది యువత కు మాట్లాడే అవకాశం యువశక్తి కార్యక్రమంలో కలుగజేస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున తరలివస్తామంటున్నారని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో మేమంతా ఈ కార్యక్రమం ఏర్పాట్లలోనే ఉంటామమన్నారు.  175 కు 175 గెలుస్తామన్న సీయం జగన్ ప్రతిపక్షాల సభలను భయంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని..   సీయం మాత్రం ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ సభలు ,హెలికాప్టర్ ప్రయాణాలూ చేస్తున్నారని మండిపడ్డారు. మీటింగ్ లకు రాకపోతే పెన్షన్స్ తెసేస్తామని అధికారపార్టీ భయపెడుతోందని విమర్శించారు. జగన్ పర్యటనలో  సమయంలో  బాధితులు రావడం..సీయం వారికి సహాయం చేయడం..అంతా ఒక నాటకమని విమర్శించారు. 


డైవర్షన్ కోసమే వివాదాస్పద జీవో 


ప్రజల్లో   పెన్షన్ లు తొలగించారని ఎప్పుడైతే ఆందోళన మొదలైందో డైవర్షన్ కోసం ..ప్రతిపక్ష సభల రద్దు కోసం జీవో తెచ్చారన్నారు.  టీఆర్ యస్ పార్టీ తో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చీలిక తెచ్చింది కేసీఆర్ .ఇప్పుడుబీఆర్ యస్ పార్టీ ఏర్పాటు తో ఏపీ కి న్యాయం ఎలా చేస్తారుని  ప్రశ్నించారు. కేసీఆర్ లో నిజాయితీ ఉండాలి. జగన్ కు సాయం అందించడానికి జనసేన ఓటు చీల్చడానికీ బీఆర్ యస్ పెట్టారని  నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కాపు నేతల్ని చేర్చుకుని కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 


యువశక్తి కార్యక్రమంపై పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారు ?


ఇటీవల ఏపీలో జీవో నెంబర్ 1 దుమారం రేగుతోంది. సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పోలీసులు కేసులు పెడతారు. కుప్పం చంద్రబాబు పర్యటనలో అదే జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ రణస్థలంలో యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నిజానికి ఇవన్నీ జీవో నెంబర్  1 తీసుకు రావడానికన్నా ముందే ఖరారయ్యాయి. అయితే జీవో వచ్చాక.. పరిస్థితులు మారిపోయాయి. ఓ వైపు వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఎక్కడిక్కడ రోడ్ షోలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేతలకు మాత్రం పక్కాగా నిబంధనలు పెడుతున్నారు. దీంతో దుమారం రేగుతోంది. యువశక్తి సభపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.