Janasena Song Release : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేడి రాజుకుంది. వైసీపీ (Ycp), తెలుగుదేశం(Tdp), జనసేన(Janasena), బీజేపీ (Bjp), కాంగ్రెస్ (Congress ), వామపక్షాలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. అధికార వైసీపీ ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించింది. పలు మార్పులు చేసింది. వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసింది. టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అభివృద్ధే అజెండాగా...ప్రతి చేతికీ పని..ప్రతి చేనుకీ నీరు అన్న నినాదంతో టీడీపీ-జనసేన కూటమి ముందుకు సాగుతోంది. సంక్షేమమే సంకల్పంగా...నిరుద్యోగులకు బాసటగా, ఉపాధి అవకాశాల బాటగా, వ్యవసాయానికి పెద్దపీటగా, కౌలు రైతులకు ఊరట కల్పిస్తామని హామీ ఇచ్చాయి. 


సంక్రాంతి సంబరాల్లో జనసేన పల్లె పాట అంటూ జనసేన కొత్త పాటను విడుదల చేసింది. పరశురాముడు వచ్చినాడురో సూడన్న... ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న.. సింహమయి కదిలినాడురో మా యన్న, గాజు గ్లాసుకు ఓటు వెయ్యరో పెద్దన్న అంటూ సాగే ప్రచార గీతాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసింది.