Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితులపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేసింది. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల ఫొటోలు తీసి వాటికి గుడ్ మార్నింగ్ సీఎం సర్ అనే టాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు జనసేన కార్యకర్తలు. దీంతో పాటు మధ్య మధ్యలో జనసేన అధినేత పవన్ కార్టూన్ లతో ఏపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా మరో కార్టూన్ ట్వీట్ చేశారు. ఇందులో సీఎం జగన్ కు ఏపీ ప్రజల నుంచి ఒక పార్సిల్ వస్తుంది. అందులో కొత్త షూస్ ఓ లేఖ ఉంటుంది. సీఎం జగన్ ను పోలిన కార్టూన్ హెలికాఫ్టర్ ఎక్కడానికి వెళ్తుంటారు. ఆ లేఖలో కొత్త షూస్ వేసుకుని మరోసారి పాదయాత్ర చేయాలని ప్రజల నుంచి రిక్వెస్ట్ సార్ అనే సెక్రటరీ చదువుతున్నట్లు వ్యంగ్యంగా ఆ కార్టూన్ ఉంటుంది.
గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ సెటైర్లు
మరో కార్టూన్ లో ఇంకోసారి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటే చంపేస్తా అంటూ ఫైర్ అవుతున్న జగన్ కార్టూన్ పోస్టు చేశారు పవన్. రోడ్ల పరిస్థితులపై విమర్శిస్తూ బైక్ తో జంప్ చేస్తున్న కార్టూన్ పోస్టు చేశారు. పవన్ కల్యాణ్ కార్టూన్లతో జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వినూత్న రీతిలో సెటైర్లు వేస్తున్నారు. వరుసగా ఒక్కో సమస్యపై జగన్ సర్కార్ వైఫల్యాన్ని వివరించేలా కార్టూన్లు ట్వీట్ చేస్తున్నారు. ఇటీవల పిల్లల స్కూళ్లను మూసేస్తున్న తీరుపై కార్టూన్ పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది. సీఎం జగన్ తనను తాను పిల్లలకు మామయ్యగా చెప్పుకుంటూ ఉంటారు. అ మాటతో బడులు మూసేస్తున్న వైనంపై కార్టూన్ వేయించారు. ముద్దుల మామయ్య కాదు దొంగ మామయ్యని బడిని ఎత్తుకెళ్తున్నారని పిల్లలు కోపంగా చూస్తూండటాన్ని కార్టూన్‌గా వేయించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.