Janasena Chief Pawan Kalyan Clarity On Deputy Cm Post: ఏపీలో కూటమి 164 అసెంబ్లీ స్థానాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. అనంతరం మంత్రులకు కేటాయించే శాఖలపైనా ఆయన ఫోకస్ చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, కూటమిలో భాగంగా జనసేన పోటీల చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మంత్రివర్గంలోకి పవన్ వెళ్తారా.? లేక ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా.? అనేది ఆసక్తికరంగా మారింది.


ఆ పదవిపై ఆసక్తి.?


అయితే, జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మంత్రి వర్గంలోకి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని.. ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు సముఖంగా ఉన్నారని ఓ జాతీయ మీడియా ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి.. పవన్, ఆయన భార్య అనా లెజీనోవా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన సమాధానాలు అస్పష్టత ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని సదరు మీడియా ఛానెల్ వెల్లడించింది. దీనిపై ఆ ఛానల్‌లోనూ ప్రసారం చేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు వెల్లడించారని స్క్రోలింగ్‌లో పేర్కొన్నారు. కాగా, దీనిపై జనసేన పార్టీ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.


Also Read: Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ కృష్ణా జిల్లాలోట్రాఫిక్ ఆంక్షలు- ఈ రూట్స్‌లో అసలు వెళ్లొద్దు