Jagan Fir On TDP: సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో తాను రూ. 1750 కోట్లు లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలపై తాను రూ.వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారు. అమెరికాలో దాఖలైన ఎఫ్‌బీఐ చార్జిషీటులో తన పేరు లేదని స్పష్టం చేశారు. తాను అన్ని వివరాలను చెబుతున్నా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని తన ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని జగన్ ఆరోపించారు.
తియ్యటి కబురుతో వచ్చిన సెకీ లేఖ
2021 సెప్టెంబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం నుంచి తియ్యటి కబురుతో లేఖ వచ్చిందని.. యూనిట్‌కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్‌ను ఇస్తామని చెప్పిందని జగన్ స్పష్టం చేశారు. ఇందులో 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పిందన్నారు. మేమే పవర్ సప్లై చేస్తామని చెప్పిందని మూడో పార్టీ లేదన్నారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు కూడా రాయితీ ఇస్తామని చెప్పిందని దీని వల్ల లక్ష కోట్లు ఆదా అవుతుందన్నారు. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే ఒప్పందమని జగన్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం చేసుకోకపోతే తననే నిందించేవారన్నారు.
Also Read: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
చంద్రబాబు హయాంలోనే ఎక్కువ రేటు
చంద్రబాబు హయాంలో విండ్, సోలార్ పవర్ ఒప్పందాలు రూ.5.90 కి చేసుకున్నారని జగన్ తెలిపారు. 25 ఏళ్లకు లక్షల కోట్ల ఆదాయం కలిసొస్తే.. చంద్రబాబు ఒప్పందాలతో అదే పాతికేళ్లకు 87 వేల కోట్ల నష్టం జరిగేదన్నారు. సెకి ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించామన్నారు. 40 రోజలు అధ్యయనం జరిగిందిని .. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ అనుమతించిందని జగన్ తెలిపారు. సెకీ ఎవరి నుంచి పవర్ తెస్తుందో తమకు సంబంధం లేదన్నారు.
Also Read: Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
సగం సగం తెలివి ఉన్న ఆయన తరఫునవాళ్లు కొందరు ఈ ఒప్పందాన్ని వక్రీకరిస్తున్నారని జగన్ ఆరోపించారు. గుజరాత్‌లో 1.90తో ఒప్పందం చేసుకుంందని చంద్రబాబు అంటున్నారని.. కానీ గుజరాత్ నుంచి తెప్పించి ఉంటే.. ఇంటర్ మిషన్ ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు పడేవన్నారు. గుజరాత్, రాజస్థాన్ పవర్ జనరేషన్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ట్రాన్స్‌మిషన్ ఛార్జ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని విమర్శఇంచారు. గుజరాత్‌లో సెకీ పిలిచిన టెండర్లు రూ.2.62కి తక్కువ లేవన్నారు. మంచి చేసిన వాళ్ల మీద రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు.
అదానీతో భేటీలు విద్యుద్ ఒప్పందాల కోసం కాదు !
అదానీతో భేటీల తర్వాతే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎఫ్బీఐ చార్జిషీట్‌లో ఉన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే విద్యుత్ ఒప్పందాలకు అదానీతో సమావేశాలకు సంబంధం లేదన్నారు. ఏపీలో అదానీకి చాలా ప్రాజెక్టులు ఉన్నాయన్నారు.