Jagan disproportionate assets case in Court: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గురువారం సీబీఐ కోర్టు కేసుల్లో హాజరు అవుతున్నారు. ఆయన షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షెడ్యూల్ ను వ్యక్తిగత సిబ్బంది ప్రోటోకాల్ కోసం తెలంగాణ ప్రభుత్వ అధికారులకు పంపారు.
ఆ షెడ్యూల్ ప్రకారం జగన్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలో బయలుదేరుతారు. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడ్నుంచి నాంపల్లి కోర్టుకు పదకొండున్నరకు చేరుకుంటారు. పన్నెండున్నర వరకు కోర్టులో ఉంటారు. అంటే గంట సేపు మాత్రమే కోర్టుకు సమయం కేటాయించారు. కోర్టు ఎంత సేపు ఉంటుదో చెప్పడం కష్టం. అందుకే జగన్ కోర్టుకే సమయం ఇచ్చారని నెటిజనలు సెటైర్లు వేస్తున్నారు. పన్నెండున్నర నుంచి తన నివాసం లోటస్ పాండ్ కు వెళ్తారు. లోటస్ పాండ్ జగన్ ఉండటం లేదు. కేవలం భోజనం చేసేందుకు వెళ్తున్నారు. లోటస్ పాండ్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్తారు.
జగన్ మీదున్న సీబీఐ కేసులు 2012లో ప్రారంభమైనవి, అక్రమ ఆస్తులు (డిస్‌ప్రొపర్షనేట్ అసెట్స్), క్విడ్ ప్రో క్వో (మనీ లాండరింగ్), కొడి కత్తి కేసు మొదలైనవి. మాజీ సీఎంగా ఉన్నప్పుడు వీక్లీ పిటిషన్లు వేసి అనుమతి తీసుకున్న జగన్, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా 'బిజీ'గా ఉన్నారని వాదనలు చేస్తున్నారు. తాజాగా, ఈ నెల 11న యూరప్ పర్యటన తర్వాత కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ ఆయన రాలేనని.. వీడియో కాన్ఫరెన్స ద్వారా హాజరవుతానన్నారు. కానీ కోర్టు కుదరదని స్పష్టం చేసింది.