Kodi Kathi Srinu Family Meet Governor: రాష్ట్రంలో దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులపై నివేదిక సమర్పించటానికి రాష్ట్ర గవర్నర్​ను సమతా సైనిక్ దళ్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కలిశాయి. వీరితో పాటు కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, దళిత సంఘాల నేతలు సైతం వెళ్లారు. ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ కలిసి వినతి పత్రం సమర్పించారు.                                                   


కోడి కత్తి కేసు సంఘటనతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న పూర్తి వివరాలను తెలియజేశారు.  రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ లపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల సంఘటనలను కూడా వివరించారు. గవర్నర్ సావధానంగా అన్ని అంశాలను విన్నారని.. న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని  నేతలు చెప్పారు.                                                                  


సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ కొద్ది రోజుల క్రితం నిరహార దీక్ష చేపట్టారు. అదే విధంగా కోడి కత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ శ్రీనివాస్​ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం శీను తల్లి సావిత్రమ్మ సైతం నిరాహార దీక్షం చేశారు. కోడి కత్తి శ్రీనివాస్​ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. కోడి కతి శ్రీనుకు ఇప్పటికే అనేక ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. దళితుడైన శ్రీను నిందితుడిగా అయిదేళ్ల పాటు జైల్లో మగ్గుతున్నాడని అంటున్నారు. 


ఇప్పటికే  కోడి కత్తి శ్రీనివాసరావు బెయిల్ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోడి కత్తి శ్రీను పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హత్యాయత్నం కేసులో జైల్లో మగ్గుతున్నానని... తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోడి కత్తి శీను గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్ ఇచ్చేందుకు ఎన్ఐఏ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా కావాలనే విచారణ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని, దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడి కత్తి శీను నా జైల్లో ఉండవలసి వస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.