గత ప్రభుత్వ కాలంలో జరిగాయని చెబుతున్న ఫోన్ ట్యాపింగులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచన సృష్టిస్తున్నాయి. ఆ పార్టీ ఈపార్టీ అని లేకుండా విపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన లీడర్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అప్పటి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రస్తుత ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసారని షర్మిల వర్గం ఆరోపిస్తోంది
షర్మిల కోసం కోడ్ భాష
గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ లో జరిగింది అని చెబుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వస్తున్న కీలక విషయాలు చాలా మందిని కలవరు పెడుతున్నాయి. అప్పటి ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు ,ఇప్పటి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అన్నతో విభేధించి సొంతం గా అప్పట్లో పార్టీ పెట్టుకున్న షర్మిల ఫోన్ల ను అత్యంత గోప్యంగా ట్యాప్ చేసారని వారు ఆరోపిస్తున్నారు. షర్మిల కోసం ప్రత్యేకంగా కోడ్ భాషను వాడేవారని ఆమె సన్నిహితులు అంటున్నారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డు చేసి ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ” అన్నకు “ అందజేసేవారని, షర్మిల తో మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచేవారని ఆమె సన్నిహితులు అంటున్నారు. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించిన ఓ సీనియర్ పోలీస్ అధికారి అప్పట్లో వారికి వార్నింగ్ సైతం ఇచ్చారని ఆమె PA ఇలా సైతం వేధింపులు ఎదుర్కొన్నవారిలో ఉన్నారని వారు అంటున్నారు.
"తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు "అప్పట్లోనే షర్మిల గుర్తించినట్టు, ఈ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్టు ఆమె వర్గం చెబుతోంది. అయితే అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఇలా షర్మిల ఫోన్ ట్యాప్ చేసి జగన్ కు సమాచారం ఇచ్చేదా లేక అప్పటి ఏపీ ప్రభుత్వమే షర్మిల ఫోన్ ట్యాప్ చేయించేదా అనే విషయం పై షర్మిల వర్గం స్పష్టత ఇవ్వడం లేదు.