YSRCP News : పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్యాత్నం కలకలం - అదేమి లేదని వివరణ

Andhra Politics : పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరానని డిశ్చార్జ్ అయ్యానని అదీప్ రాజ్ ప్రకటించారు.

Continues below advertisement

Former Pendurthi MLA Adeep Raj  suicide attempt  : ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆయన నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి వెళ్లడంతో ఉన్న పళంగా కుటుంబసభ్యులు మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం ఆయనది ఆత్మహత్యాయత్నం కాదని.. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఆస్పత్రిలో చేరారని అంటున్నారు. ఆయన డిశ్చార్జ్ అయ్యారని చెబుతున్నారు.                          

Continues below advertisement

ఈ అంశంపై అదీప్ రాజ్  వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. ఫుడ్ పాయిజన్ అయిందన్న అనుమానంతో తెల్లవారుజామున రెండున్నరకు ఆస్పత్రికి వెళ్లానని...అది గ్యాస్ట్రిక్ సమస్య మాత్రమేనని ఆరున్నరకే డిశ్చార్జ్ అయ్యానని తెలిపారు. చిన్న విషయాన్ని పెద్ద విషయంగా మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలకు అందుబాటులో ఉంటానని అదీప్ రాజ్ చెప్పుకొచ్చారు. 

అదీప్ రాజ్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు . అయితే ఆయనకు ఆత్మహత్యాయత్నం చేయాల్సిన అవసరం ఏమిటన్నది స్పష్టత లేదు. అదీప్ రాజ్ కుటుంబం రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు. అందుకే 34 ఏళ్ల వయసులోనే ఆయనకు మొదటి సారిగా 2019లో టిక్కెట్ లభించింది. వైసీపీ అధినేత జగన్ అదీప్ రాజ్ ను ప్రోత్సహించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఇరవై ఎనిమిది  వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయిత గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి జనసేన తరపున పంచకర్ల రమేష్ బాబు కూటమి తరపున పోటీ చేశారు. పంచకర్ల రమేష్ బాబు ఏకంగా 81వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఓటమి అదీప్ రాజ్ ను బాగా కుంగదీసిందని చెబుతున్నారు. మరో వైపు కుటుంబంలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. 

అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నం అంశంపై విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన వివరణ ఇచ్చారు.   తమపై తప్పుడు  ప్రచారం చేస్తున్నారని అదీప్ రాజ్ కు ఆత్మహత్యాయత్నం చేయాల్సిన అవసరం లేదని..  చిన్న గ్యాస్ట్రిక్ సమస్య వల్లనే ఆయన ఆస్పత్రిలో చేరారని అంటున్నారు.   

ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ఖర్చులతో పాటు.. బెట్టింగులు వంటివి కూడా వారికి పెద్ద సమస్యగా మారాయి. క్యాడర్ నుంచి కూడా వారిపై ఒత్తిళ్లుఉంటున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఇలాంటి సమయంలో అదీప్ రాజ్ ఆత్మహత్యాయత్నం వార్త వైరల్ అయింది. కానీ అలాంటిదేమీ లేదని స్వయంగా అదీప్ రాజ్ వీడియో విడుదల చేయడంతో అంతా తేలిపోయినట్లయింది.                                                                           

Continues below advertisement
Sponsored Links by Taboola