IPS Sunil Kumar erious allegations against Deputy Speaker Raghurama: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ తీవర్ ఆరోపణలు చేస్తున్నారు.ఆయనను అన్ని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రఘురామపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన సుప్రీం కోర్టు RRR ని, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రకటించారు. అమరావతి రాజధాని గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యుటీ స్పీకర్ హోదా లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే ఆది ఆయనకి కాదు రాష్ట్రం మొత్తానికి తల వంపులని.. అమరావతి బ్రాండ్ దెబ్బ తింటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కి పోతారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి , నారా లోకేష్ ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కి పోతాయన్నారు. కేసు దర్యాప్తు ముగిసి, కోర్టులో విచారణ పూర్తి అయ్యి రఘురామకృష్ణ రాజు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవి అయినా ఇవ్వండి. అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.
రఘురామపై ఉన్న కేసులు ఇవే
రఘురామకృష్ణంరాజు డైరెక్టర్‌గా ఉన్న ఇండ్-భారత్ థర్మల్ పవర్ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ , రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ , ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీల నుంచి సుమారు రూ. 2,655 కోట్ల మేర రుణాలు పొందింది.ఈ నిధులలో దాదాపు రూ. 947 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారని, ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులను మోసం చేశారని సీబీఐ అభియోగం మోపింది. ఈ కేసులో రఘురామతో పాటు ఆయన భార్య కనుమూరు రమాదేవి, ఇతర కుటుంబ సభ్యులు డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఈ రుణాల మోసం కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం కావాలని, విచారణకు అడ్డంకులు తొలగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చారు.
పీవీ సునీల్ పై కస్టోడియల్ టార్చర్ కేసు పెట్టిన పీవీ సునీల్ కుమార్
గత ప్రభుత్వ హయాంలో సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గతంలో రఘురామపై సీఐడీ అధికారులు రాజద్రోహం కేసులు పుట్టిన పుట్టిన రోజు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన రోజు రాత్రి సునీల్ కుమార్ నేతృత్వంలోసీఐడీ అధికారులు ఆయనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఏ వన్‌గా సునీల్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఈ కేసు విషయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపుగా ఐదు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు.
ఇద్దరి మధ్య ఇలాంటి వివాదాలు వ్యక్తిగతస్థాయికి చేరుకున్నాయని తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. అయితే సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి. ఆయన సర్వీస్ రూల్స్ పట్టించుకోకుండా ఇలా రాజకీయంగా ఇతరులతో తలపడటం వివాదాస్పదమవుతోంది.