Dharmavaram Politics: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram Constituency) నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బీజేపీ నేత సత్య కుమార్ కు మద్దతుగా సినీ నటి బీజేపీ మహిళా నేత నమిత (Namitha) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా ధర్మవరం (Dharmavaram Constituency) పట్టణంలోని చౌడేశ్వరి దేవి దేవాలయంలో నమిత (Namitha) దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మవరం (Dharmavaram Constituency) పట్టణంలో నమిత (Namitha) రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం (Dharmavaram Constituency) నియోజకవర్గం లోని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా నమిత (Namitha) కొనసాగుతున్నారు. చెన్నైలో కూడా లోక్‌సభ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. 


ఇక ధర్మవరం (Dharmavaram Constituency) నుంచి కూటమి తరపున బీజేపీ నేత సత్యకుమార్ బరిలో ఉండగా.. ప్రత్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. కేతిరెడ్డిపై ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో సత్య కుమార్ ఉన్నారు. ఇక ఈరోజు ముదిగుబ్బ మండలంలోని ముక్తాపురం, గుడ్డంపల్లి తండా గ్రామాల్లో సత్యకుమార్ పర్యటించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాము ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేస్తామని ప్రచారంలో చెబుతున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా బాధ్యతను తీసుకుంటానని ప్రజలకు చెబుతున్నారు. తనను ఆదరించి గెలిపిస్తే నిత్యం ఇక్కడే ఉండి అందరికీ అందుబాటులో ఉంటానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆదరించాలని కోరారు. 


‘‘ఓటేసి గెలిపించిన ప్రజలకు సంక్షేమ పాలన అందించాల్సిన బాధ్యత మరచి ఐదేళ్లుగా కబ్జాలు, ఆక్రమణలు, అవినీతికి వైసీపీ నాయకులు పాల్పడటం దురదృష్టకరం. ధర్మవరం (Dharmavaram Constituency) నియోజకవర్గంలోని  ప్రజలు సమస్యలతో బాధపడుతున్నా వాటికి పరిష్కారం చూపకుండా విలాస జీవితం గడుపుతున్నాడు కేటురెడ్డి. వైసీపీ రాక్షస పాలనకు స్వస్తి పలకడం కోసం మే 13న జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నాను. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే దశాబ్దాలుగా ధర్మవరం (Dharmavaram Constituency) నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగు నీటి సమస్యకు పరిష్కారం చూపిస్తాను. జల్ జీవన్ మిషన్ తో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా కృషి చేస్తాను’’


మోదీ గారి ధ్యేయం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. భారతదేశంలోని ముస్లిం సోదరుల సంక్షేమం, భవిత కోసం ఎన్నో పథకాలను, కార్యక్రమాలను అమలుచేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ వైసీపీ మాత్రం రాష్ట్రంలోని ముస్లిం సోదరుల సంక్షేమం కోసం చేసింది శూన్యం. వారికి అందాల్సిన ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని రాకుండా చేసి వారి వెనక బాటుకు కారణం అయింది. ధర్మవరం (Dharmavaram Constituency) నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు మీ బిడ్డగా నన్ను భావించి మే 13న జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నాను’’ అని సత్యకుమార్ ప్రచారంలో మాట్లాడారు.