YS Viveka Case:   వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు  బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అరెస్ట్ చేయవద్దని కావాలంటే  కస్టోడీయల్  ఇంటరాగేషన్ చేసుకోవచ్చునని అవినాష్ రెడ్డి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి న్యాయమూర్తిని కోరారు. సుప్రీం కోర్టు గతం లో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇలంటి ఆదేశాలు ఇస్తే మేము తప్పకుండా పాటీస్తామన్నారు. అవినాష్ పై ఎలాంటి కేసులు లేవని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ నిందితుడిగా పేర్కొనలేదని   అవినాష్ పేరు పెట్టలేదని ఆయన తరలు లాయర్ వాదించారు. దస్తగిరికి కుట్రపూరితంగా బెయిల్ ఇచ్చారని..  నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న నేరగాడికి బెయిల్ ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. దస్తగిరి స్టేట్ మెంట్ పరస్పర విరుద్దంగా ఉందన్నారు.  . ఐదు రోజుల తర్వాత ఇచ్చిన 160 స్టేట్మెంట్‌లో గుర్తు చేసుకుని చెబుతున్నానని అవినాష్, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివ శంకర రెడ్డి పేర్లు చెప్పాడు. ఇందులోనే ఈ వ్యవహారం అంతా అవినాష్ చూసుకుంటాడు.. మిగతా డబులు కూడా ఇస్తారని చెప్పాడు. దస్తగిరి బెయిల్ పిటిషన్ సీబీఐ ఎక్కడా అపోజ్ చేయలేదు. దస్తగిరిని ముందుగానే ప్లాన్ చేసి సీబీఐ అవినాష్ రెడ్డి పేరు చెప్పేలా చేసింది. సీబీఐ చెప్పిన వాటికి దస్తగిరి అంగీకరించి అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి బెయిల్‌లో మెరిట్స్ పరిగణలోకి తీసుకోలేదు. మర్డర్ కేసు ప్రత్యేక్షంగా పాల్గొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం నేను ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకూ వివేకా హత్య కేసులో సీబీఐ రెండు ఛార్జ్ షీట్లు వేసింది. రెండు ఛార్జ్ షీట్లలో కానీ రిమాండ్ రిపోర్టులో కానీ ఎక్కడ అవినాష్ పేరు గానీ భాస్కర్ రెడ్డి పేరు కానీ ప్రస్తావించలేదు’ అని అవినాష్ తరఫు లాయర్ కోర్టుకు వివరించారు.


వివేకా హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని సునీత తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంటిని క్లీన్ చేసిన మహిళ స్టేట్ మెంట్  విషయంలో ఇప్పటికే ఆమెను ప్రభావితం చేశారన్నారు. అవినాష్ పై ఎలాంటి కేసులు లేవని అబద్దం చెప్పారని.. ఎన్నికల అఫిడవిట్  ప్రకారం నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. సాక్షుల్ని ప్రభావితం చేయడంలో అవినాష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వంనియమించిన సిట్ ను ఆయన ప్రభావితం చేశారన్నారు. సీఐ  శంకరయ్యను కూడా  ప్రభావితం చేసి..  స్టేట్ మెంట్ ఇచ్చేవిషయంలో వనక్కి తగ్గేలా చేసి.. ఆయనకు పోస్టింగ్ ఇచ్చారని సునీత తరలు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.                


సీఆర్పీసీ 160 స్టేట్మెంట్‌లో గంగిరెడ్డి శివశంకర్రెడ్డి, గంగిరెడ్డి పేర్లు మత్రమే చెప్పారని..కానీ తర్వాత సీబీఐనే కుట్ర చేసి అవినాష్ రెడ్డిని ఇరికించేందుకు  ప్లాన్ చేసిందని ఆరోపించారు.  సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఇంకా విచారించాల్సినది ఇంకా ఉందని భావించిన హైకోర్టు శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది.