GVL :   ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మోడీ మారారని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. 2014లో బలహీనమైన దేశాల జాబితాలో భారత్ ఉండేదని…మోడీ నాయకత్వంలో ప్రపంచంలో ఐదవ బలమైన దేశంగా గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.  నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలన సుభిక్షంగా సాగిందన్న ఆయన.. ఆరున్నర దశాబ్దాలలో భారతదేశంలో ఎన్నో  అద్భుత విజయాలను మోడీ ప్రభుత్వం సాధించిందని తెలిపారు. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ ద్వారా మన సత్తా చూపించామన్న ఆయన  ప్రపంచానికి మేడ్ ఇన్ ఇండియా వాక్సిన్ అందించామని గుర్తుచేశారు.
 
మొబైల్ ఫోన్ ల తయారీ లో ప్రపంచంలో రెండవ దేశంగా భారత్‌ ఎదిగిందన్నారు జీవీఎల్.. కోవిడ్ సమయంలో వంద దేశాలకు మందులు అందించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు జీవీఎల్. రెండున్నరేళ్లలో పార్లమెంట్ ఉభయ సభల భవనాలను నిర్మించిన చరిత్ర మోడీ నాయకత్వనిది.. పది కోట్ల మందికి ఉచితం గా గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చాం.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ ఖాయం అన్నారు..  తీవ్రవాద చొరబాట్లు దాడులను  మోడీ ప్రభుత్వం అరికట్టిందని జీవీఎల్ తెలిపారు.తొమ్మిదేళ్ళ లో 74 కొత్త ఐర్పోట్ లను నిర్మించి... 55 వేల కోట్ల రూపాయల నరెగ నిధులను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చాం.. 22 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగింది.చారిత్రాత్మక పార్లమెంట్ భవన ప్రారంభానికి రాజకీయ పార్టీల నేతలు రాక పోవడం వాళ్ళ సంకుచిత మనసును తెలియ జేస్తుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.
 
2014 మందు భారత దేశం అభివృద్ధి చెందుతున్న (వెనుకబడిన) దేశాల‌ జాబితాలో ఉండేదని మోడి ప్రధాని అయిన  తర్వాత ఆభివృద్ధి చెందటమే కాకుండా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుందని తెలిపారు..మోడీ నాయకత్వంలో తొమ్మిదేళ్ళ పాలనలో  ప్రపంచంలోనే బలమైన ఐదవ దేశంగా భారత్  ఎదిగిందని స్పష్టం చేశారు... కరోనా సమయంలో ఆత్మనిర్భర్ భారత్  ద్వారా మన సత్తా ప్రపంచ దేశాలకు చూపామన్నారు. కోవిడ్ మహమ్మారి తో అల్లాడి పోతున్న  ప్రపంచ దేశలాకు మేడిన్ ఇండియా కరోనా వాక్సిన్ అందించి  ప్రపంచ దేశాలకు మన సత్తా చూపించామని వివరించారు.  
 
మోదీ అధికారంలోకి రాక మునుపు ఉగ్రవాదులు అప్పటి ప్రభుత్వాలతో గేమ్ ఆడే వారని తెలిపారు... ఉగ్రవాద సానుభూతి పరులు చెప్పిన విధంగా ప్రభుత్వాలు నడుచు  కొనేవని తెలిపారు...ఒక పక్క ఉగ్రవాదులు సామాన్య జనాలను చంపి వేస్తుంటే సానుభూతి పరులతో చర్చలు నడిపే వారని అన్నారు...మోడి అధికారంలోకి వచ్చిన  తర్వాత పరిస్తితులలో పూర్తి మార్ప వచ్చిందని  ఉగ్రవాదులను మట్టు పెట్టడం... సానుఙూతి పరులను అరెస్టు చేసి సమాచరం రాబడుతూ సామాన్య ప్రజలకు ఉగ్రవాద చర నుంచి విముక్తి కలిగించిన ఘనత మోదీ దే అన్నారు జీవీఎల్...గతంలో ప్రభుత్వాలు దేశంలోకి చొరబాట్లు పై దృష్టి పెట్టేవి కావని ఇప్పుడా పరిస్తితులు లేవన్నారు.. విదేశాలలో యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న భారతీయలను రక్షించేందుకు ఎంతైనా వెచ్చించి విమానాలలో వారిని దేశానికి తీసుకు వచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతోందని తెలిపారు.