GVL On Kanna :  సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణకు బీజేపీ తగిన ప్రాధాన్యం ఇచ్చిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. రాజీనామా చేస్తున్నట్లుగా కన్నా ప్రకటించిన తర్వాత జీవీఎల్ మొదట తానేమీ స్పందించబోనని.. పార్టీ తరపున స్పందన వస్తుందని ప్రకటించారు. కానీ కాసేపటికే ప్రెస్ మీట్ పెట్టి కన్నా విషయంలో స్పందించారు. క‌న్నా లక్ష్మినారాయణ రాజీనామాపై త‌మ అధిష్టానంతో మాట్లాడిన‌ట్టు జీవీఎల్ చెప్పారు. ముఖ్యంగా రాజీనామాకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజే వైఖ‌రే కార‌ణ‌మ‌ని, ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌లేద‌ని క‌న్నా అన‌డంపై జీవీఎల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కన్నా వ్యాఖ్య‌లు రాజ‌కీయ దురుద్దేశంతో కూడుకున్న‌వ‌ని విమర్సించారు.                        


పార్టీ ఆదేశాల మేరకు సోము వీర్రాజు నిర్ణయాలన్న జీవీఎల్ 


సోము వీర్రాజుపై క‌న్నా వ్యాఖ్య‌లు స‌మ‌ర్థ‌నీయం కాద‌న్నారు. సోము వీర్రాజు తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యం అధిష్టానం ఆదేశాల మేర‌కేనని తెలిపారు.  క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు త‌మ పార్టీ స‌ముచిత స్థానం క‌ల్పించింద‌న్నారు.సాధార‌ణంగా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు వెంట‌నే రాష్ట్ర బాధ్య‌త‌లు అప్ప‌గించదని..కానీ  క‌న్నా విష‌యంలో అలా జ‌ర‌గ‌లేద‌న్నారు. ఆయ‌న‌కు రాష్ట్ర నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని అధిష్టానం ఇచ్చింద‌న్నారు. ఆ త‌ర్వాత జాతీయ కార్య‌వ‌ర్గంలోకి తీసుకుంద‌ని జీవీఎల్ గుర్తు చేశారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివని, అధిష్టానంతో సంప్రదించాకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని జీవీఎల్ తెలిపారు.                                     


కన్నాతో ఇతర నేతలు వెళ్లకుండా జీవీఎల్ చర్చలు
  
ఇటీవల కాపు సామాజికవర్గం విషయంలో జీవీఎల్ నరసింహారావు వ్యవహరిస్తున్న తీరుపైనా కన్నా లక్ష్మినారాయణ విమర్శలు చేశారు. కాపుల రిజ‌ర్వేష‌న్‌, అలాగే వంగ‌వీటి మోహ‌న్‌రంగా పేరుకు సంబంధించి త‌న‌పై క‌న్నా చేస్తున్న విమర్శలకు జీవీఎల్ స్పందించలేదు. ఆ వ్యాఖ్యలపై తాను ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేనని స్పష్టం చేశారు. కన్నా లక్ష్మినారాయణ రాజీనామా చేయడంతో కాపు సామాజికవర్గం  నేతలు ఆయన వెంట వళ్లకుండా పార్టీకి రాజీనామా చేయకుండా జీవీఎల్ మంతనాలు జరుపుతున్నారు.                                         


సోము వీర్రాజు, జీవీఎల్ కారణం రాజీనామా చేసిన కన్నా ! 
 
సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకే పార్టీని వీడుతున్నానని కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు.  ఆయన వల్లే పార్టీలో ఇమడలేకపోయానని...పార్టీతో చర్చించకుండా జీవీఎల్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కన్నా ఆరోపించారు. . రంగా పేరు క్రిష్ణా జిల్లాకు పెట్టాలని గతంలోనే ఉద్యమం చేశాం. అప్పుడే జీవీఎల్ ఉద్యమంలో పాల్గొంటే బాగుండేదన్నారు.  కొందరు ఓవర్ నైట్ స్టార్ నేత కావాలని ప్రయత్నిస్తున్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పార్టీలో పరిస్థితులు మారాయని తెలిపారు.