పుట్టినరోజు వేడుకల్లో యువతుల అసభ్య నృత్యాలు చేసిన సీఐపై వేటు పడింది. గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు అనే రెస్టారెంట్‌లో సోమవారం రాకేష్‌ అనే వ్యక్తి  జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే ఈ పార్టీలో మద్యం సేవించడం, విజయవాడ నుంచి వచ్చిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో జరిగిన పార్టీకి గుంటూరు అర్బన్‌ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. ఆరుగురు యువతులు, 19 మంది యువకులతో రేవ్‌పార్టీ జరిగిందని సమాచారం. అసభ్యకరంగా నృత్యాలు చేసిన ఈ వీడియోలో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 


అసాంఘిక, అసభ్య కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసు అధికారే అలాంటి కార్యక్రమంలో పాల్గొని అడ్డంగా దొరికాడు. ఇటీవల గుంటూరులో ఓ వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో సీఐ పాల్గొని పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల పరువుతీసే విధంగా ఉన్న ఈ సంఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు సీఐను సస్పెండ్ చేశారు. 


గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు అనే రెస్టారెంట్‌లో గత సోమవారం రాకేష్‌ అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకులు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులకు మందు పార్టీ ఇచ్చారు. పార్టీలో మందేసిన స్నేహితులతో కలిసి చిందేయడానికి విజయవాడ నుంచి ఆరుగురు యువతులను తీసుకువచ్చారు. ఇలా పార్టీకి వచ్చిన వారితో అమ్మాయిలు అసభ్యకరంగా డాన్స్ లు చేశారు. 


పుట్టినరజు పార్టీ ముసుగులో జరుగుతున్న ఈ రేవ్ పార్టీపై పట్టాభిపురం పోలీసులకు సమాచారం అందింది. హోటల్ పై దాడి చేసి, పార్టీలో పాల్గొన్న వారితో పాటు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పార్టీలో అర్బన్‌ సీసీఎస్‌ సీఐ వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. దీంతో సీఐపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు.   


కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించి, ఇతరులకు ఇబ్బంది కలిగించడంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకర నృత్యాలు చేసినందుకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. బాధ్యత గల పోలీసు వృత్తిలో ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 


Also Read: Niharika Konidela: నిహారిక భర్తపై పోలీస్ కంప్లైంట్.. అర్ధరాత్రి చేసిన రచ్చ కారణంగానే..