Breaking News Telugu Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్, 350 మందికి పైగా అస్వస్థత 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP DesamLast Updated: 15 Jul 2022 06:17 PM

Background

నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.  దక్షిణ కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం తాజాగా ఉత్తర కోస్తా ఒడిశా దాని...More

బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్, 350 మందికి పైగా అస్వస్థత 

నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మెస్ లో మధ్యాహ్నం ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  350 మందికి పైగా విద్యార్థులు స్వల్ప వ్యవధిలోనే వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. విద్యార్థులను చికిత్స కోసం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రిలో జాయిన్ చేశారు.