Gannavaram TDP MLA Yarlagadda Venkatarao : గన్నవరం తెలుగుదేశం పార్టీలో అంతర్గత వివాదాలు రోడ్డు మీదకు వచ్చాయి. తోటి నేతలపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విరుచుకుపడ్డారు. వల్లభనేని వంశీతో కలిసి కొంత మంది టీడీపీ నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని.. సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు.  గతంలో వైసిపి పార్టి లో పని చేస్తుంన్నందుకు సిగ్గు  పడుతున్నానుని..  ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధ  తన నియోజకవర్గంలోని వైసీపీ నేతల వారి కార్యక్రమానికి వెళ్లారని దాన్ని మాత్రమే తాను ప్రశ్నించానన్నారు. అంతకు మించి వేరే  సమస్యలేమీ లేవన్నారు.  గన్నవరం నియోజకవర్గంలో నలుగురు టిడిపి మాజీ శాసనసభ్యులు ఉన్నారని అందర్నీ సమన్వయం చేసుకుంటున్నానని స్పష్టం చేశారు. 


వంశీతో కలిసి కుట్రలు    


మాజీ ఎమ్మెల్యే వల్లభేని వంశీ తో ప్రస్తుతం కొంత మంది టిడిపి నాయకులు టచ్ లో ఉన్నారని.. అందులో విజయాడైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఒకరన్నారు. వంశీతో కలిసి తనపై సాక్షి పత్రికలో  పనికి మాలిన రాతలు రాయిస్తున్నారన్నారు.  పదవి ఇప్పించిన దేవినేని ఉమా జీవితాన్ని కూడ బలి చేసిన వ్యక్తి ఇతనేనని..   ఇంటిలిజెన్స్ ఎస్ ఐ శ్రీనివాస్ , సాక్షి రిపోర్టర్ తో మాట్లాడిన విషయాలు అన్ని తెలుసని స్ప్టం చేశారు.  టిడిపి పార్టి బలోపేతం కోసం ఓక్క రోజు అయినా పని చేయలేదని చలసాని ఆంజనేయులపై మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలో లక్షలాది మంది క్యాండిల్ ర్యాలి చేస్తే... నువ్వు  ఎక్కడికి పోయావవని ప్రశ్నించారు. 


విజయా డైరీ చైర్మన్ అవినీతిపై విచారణ


తన మీద విచారణ చేయిస్తానని చలసాని ఆంజనేయులు అంటున్నారని.. వైసిపి వాళ్లతో అంట కాగి డబ్బు సంపాదించుకున్న  చలసానిలాగా తాను సంపాదించలేదన్నారు.  పెద్ది రెడ్డి , కోడాలి నాని తో అంటకాగింది నిజం కాదా ్ని ప్రశ్నించారు. విజయా డైరీ పాలబూత్‌లు అన్నీ వైసీపీకి చెందిన వారికే ఇచ్చారని మండిపడ్డారు.  నా విజయాన్ని కాంక్షిస్తూ పవన్ కూడ నా నియోజకవర్గానికి వచ్చారు కానీ తన కోసం ప్రచారం చేయలేదన్నారు.  ఓక పార్టిలో ఉంటూ  మరో పార్టికి పనిచేశావవని...  మంత్రి లోకేష్ ను ,ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలసి జరిగింది తెలియజేస్తానన్నారు.  విజయ డైరి మీద ఎంక్వైరి వేసి అవినీతి ని బయటకు తీయాలని కోరుతానన్నారు.   


చంద్రబాబు కోసం మూడు సార్లు యాగాలు చేశా


వైసీపీలో అన్యాయం చేశారని 2014 ఎన్నికల్లో నేను పెనమలూరు సీటు అడగటం జరిగింది .సీటు ఇస్తానని వైసిపి పార్టి నన్ను నమ్మించి వచ్చాక... బ్రతిమిలాడి గన్నవరం నియోజకవర్గం  పంపారన్నారు.  కెడిసిసి బ్యాంకు ను నేను అభివృద్ది చేస్తే నన్ను చైర్మన్ గా తొలగించిన నీచమైన ప్రభుత్వం అప్పటి వైసిపి ప్రభుత్వమని  విమర్శించారు  గన్నవరం రాజకీయాల్లో నేను యుద్దం చేశాను  ఒక రాక్షసుడి తో పోటి చేశాను ....  యజ్ణంలా పని చేశానన్నారు.రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మూడు సార్లు యాగాలు చేశానన్నారు.  మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను ..ఖచ్చితంగా మంచి చేస్తానన్నారు. అంతర్గత వివాదాలు ముదిరి ప్రెస్ మీట్ల వరకూ రావడంతో.. హైకమాండ్ ఈ అంశంల జోక్యం చేసుకోవాలని కృష్ణా జిల్లా నేతలు కోరుతున్నారు.