Yuva Galam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం ముగిసింది. యువగళం చివరిరోజు కావడంతో లోకేష్ తో కలసి ఆయన తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. ఒక్కరోజు బ్రేక్ తీసుకుని, బుధవారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలో నిర్వహించనున్న లోకేష్ యువగళం విజయోత్సవ సభకు తరలిరానున్న టీడీపీ శ్రేణులకు శుభవార్త చెప్పారు. పలు ప్రాంతాల నుంచి ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని టీడీపీ కల్పించింది.


టీడీపీ ప్రకటించిన ఉచిత ట్రైన్ల వివరాలు ఇవే..
1- ట్రైన్ నెంబర్- 00712/00713 (స్పెషల్ ట్రైన్)
సమయం:7.45 Pm (నెల్లూరు)
కావలి-8.45 Pm
ఒంగోలు-9.30 Pm
నెల్లూరు నుంచి విజయనగరం


2- ట్రైన్ నెంబర్- 00700/ 00701
చిత్తూర్- 11.00Am
పాకాల- 11.30Am
రేణిగుంట- 1.30Pm


ట్రైన్ నెంబర్- 00702/ 00703
తిరుపతి- 2.00 Pm
శ్రీకాళహస్తి- 2.40 Pm
వెంకటగిరి- 3.20 Pm
గూడూరు- 4.00 Pm






నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభ డిసెంబర్ 20న నిర్వహించే పనులో టీడీపీ శ్రేణులు బిజీగా ఉన్నాయి. బహిరంగ సభకు 110 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, దాదాపు 5 లక్షల మంది తెలుగు తమ్ముళ్లు సభకు హాజరవుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారని తెలుస్తోంది. యువగళం పాదయాత్ర ముగింపు సభకు నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ కీలక నేతలు జిల్లాల తెలుగు తమ్ముళ్లకు పిలుపునిచ్చారు.