Four IAS who were relieved from Telangana reported in AP : తెలంగాణలోనే కొనసాగేందుకు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో తెలంగాణలో రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్టు చేశారు. ఏపీ సచివాలయానికి వచ్చిన వారు  సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు తమ జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. త్వరలోనే వారికి పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉంది. కాట అమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, వాకాటి అరుణ ఏపీలో రిపోర్టు చేశారు. వాస్తవానికి వీరంతా పదహారో తేదీనే ఏపీలో రిపోర్టు  చేయాల్సి ఉంది. ఆ తేదీనే ఫైనల్ చేస్తూ.. డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.


బుధవారం రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం 


అయితే  తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్  చేయడానికి  పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు. డీవోపీటీ ఉత్తర్వుల విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది.  దీంతో వారు ఏపీలో రిపోర్టు చేయక తప్పలేదు. మరో వైపు ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు డీవోపీటీ ఉత్తర్వుల మేరకు తెలంగాణలో బుధవారమే రిపోర్టు చేశారు.             


ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు


ఉన్న  క్యాడర్‌లోనే కొనసాగాలనుకున్న  ఐఏఎస్‌లు


రాష్ట్ర విభజన తర్వాత క్యాడర్ విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఐఏఎస్‌లకు విభజించింది. తెలంగాణ క్యాడర్ కేటాయించిన కొంత మంది.. ఏపీ కేడర్ కేటాయించిన కొంత మంది ఈ కేటాయింపు సరి కాదని క్యాట్ లో పిటిషన్లు వేయడంతో పాటు న్యాయపోరాటం చేశారు. పదేళ్ల పాటు వారు కోరుకున్న రాష్ట్ర క్యాడర్ లోనే కొనసాగారు. కానీ ఇప్పుడు తుది  నిర్ణయం రావడంతో వెనక్కి వెళ్లక తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగితే కీలక పోస్టింగులు ఉంటాయని ఇప్పుడు ఏపీకి వెళ్తే పెద్దగా పట్టించుకోరన్న అభిప్రాయంతో ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగాలని అనుకున్నట్లగా తెలుస్తోంది. 



Also Read: సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్




తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారులు అంజనీకమార్, అభిలాష్ బిస్త్ కూడా ఏపీలో  రిపోర్టు చేయాల్సి ఉంది. వారు ఇంకా రిపోర్టు చేయలేదు. డీవోపీటీ నుంచి వారికి ఇంకా ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ఆదేశాలు వచ్చిన తర్వాత వారు కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అంజనీకుమార్ గత ఎన్నికలకు ముందు వరకూ తెలంగాణలో డీజీపీగా పని చేశారు.