Botsa eyes watered at the press meet: సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకున్నారు.  విశాఖలో నిర్వహించిన ప్రెస్మీట్ లో  వైఎస్ గురించి మాట్లాడుతూ ఆయనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. 

Continues below advertisement

ఉదయం ప్రెస్మీట్‌లో మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ ఉన్నారన్న ఆరోపణల్నిబొత్స గతంలో చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో బొత్స సత్యనారాయణ అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బొత్స జగన్‌తో పాటు వైఎస్, విజయమ్మ, షర్మిలను కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు అప్పుడు అన్న మాటల్ని అచ్చెన్నాయుడు గుర్తు చేయడంపై మండిపడ్డాపు.  రాజకీయాల్లో అందరూ నీలాగే ఉంటారనుకుంటావా అని అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. కూటమి నేతలు సంస్కారం లేకుండా రాజకీయం చేస్తున్నారని..  విమర్శించారు. అచ్చెన్నాయుడు కావాలనే జగన్ పై బురదచల్లుతున్నారని ఆరోపించారు. ఆయన దిగజారుడు మాటలు మాట్లాడకపోవడం మంచిదన్నారు.  రాజకీయాలను నీతిగా చేయాలని బొత్స సలహా ఇచ్చారు. మావిగన్ వస్తున్న స్పందనను చూసే.. డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. అమరావతిపై విమర్శలకు రాజకీయంగా స్పందించాలని సూచించారు. 

Continues below advertisement

అచ్చెన్నాయుడు ఏమన్నారంటే? 

వైఎస్ మరణంపై చాలా మంది నాడే అనుమానాలు వ్యక్తం చేశారని అచ్చెన్నాయుడు ్న్నారు   వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని ప్రస్తుతం వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న బొత్స కామెంట్ చేశారు. ఆ రోజు మేము నమ్మలేదు… సభ్య సమాజంలో ఇలా ఎందుకు చేస్తారని అనుకున్నామన్నారు. 

 అప్పట్లో బొత్స చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు అచ్చెన్నాయుడు.. జగన్ పై అనుమానాలు రేకెత్తించేలా చెప్పేందుకు ఉపయోగించడంతో సీనియర్ నేత అయిన బొత్స ఇరకాటంలో పడ్డారు. అప్పట్లో జగన్ సొంత పార్టీ పెట్టుకున్నా బొత్స మాత్రం పీసీసీ చీఫ్ హోదాలో కాంగ్రెస్ లోనే కొనసాగారు. అసెంబ్లీలో వైసీపీ పక్ష నేతగా ఉన్న విజయమ్మపై ఘాటు విమర్శలు కూడా చేశారు. అయితే తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఐదేళ్లు చేశారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా పాత విమర్శలను టీడీపీ హైలెట్ చేస్తూండటంతో.. తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నరు. ఇప్పుడు బొత్స కన్నీరుతో అప్పట్లో ఆయన వైెఎస్ కుటుంబసభ్యులపై చేసిన విమర్శలన్నీ మళ్లీ వైరల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.