కడప: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైఎస్సార్ సీపీ వర్గీయులు కడపలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. తాము చెప్పినట్లు విని ఉండింటే గేమ్ ఛేంజర్ అయ్యేవాడివని.. కానీ ఇప్పుడు తీరా చూస్తే వేరే వాళ్ల కలలు నెరవేర్చడం కోసం పనిచేస్తున్నావంటూ పవన్ పై కడపలో వెలిసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కోట్స్ గుర్తుచేస్తూ, జనసేనానిని, జనసైనికుల్ని కవ్వించే ప్రయత్నం చేశారు. మనకు వచ్చే కలలు నెరవేర్చుకునేదానికి కష్టపడాలని కలాం గారు చెప్పారని, వేరే వాళ్ల కలలు నెరవేర్చడం కోసం కాదని ఎద్దేవా చేశారు.
కడపలో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఫ్లెక్సీలలో ఏముందంటే..
1. మేము అప్పుడే చెప్పాం ఆయన (చంద్రబాబు)తో వ్యవహారం అంత వీజీ కాదు అని.. 21 సీట్లు సరిపోవు 50 తీసుకోవాలని చెప్పాం మీరు వినలేదు...
2. 21 తో గేమ్ చేంజర్ (Game Changer) అవ్వలేము అన్నా అని చెప్పాం. ఇప్పుడు మన (Pawan Kalyan) పరిస్థితి అదే సినిమాలా అయ్యింది..
3. వాళ్ళు మనకున్నది (Janasena Seats) 21 నే కదా అని అనుకుంటున్నారు. కానీ ఆ కుర్చీ మనం ఇచ్చిన భిక్ష అని మర్చిపోయారు. వారు వాళ్ళ భజన బృందం చెప్పే విషయాలను ఎవరు నమ్మట్లేదు కనుకే జనసేనతో Alliance పెట్టుకున్నారు, ప్రచారం లో మీరు చెప్పినవే ప్రజలు విన్నారు.
4. మనము ఇంకా మన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకొకరికి (YSRCP) 11 కాదు 110 వచ్చేవి.
5. మీరు (Pawan Kalayn) ఏమో నిజాయితీగా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్తారు. కానీ వాళ్ళు మాకేం సంబంధం అంటారు, మళ్లీ ఆ తప్పులు చేసే వాళ్ళల్లో ఉండేది వాళ్ల మనుషులే... ఎప్పుడు వాళ్ళు ఆడే ఆటలో మనం బొమ్మలం అవుతున్నాం తప్పా, ఆట ఆడే టాలెంట్ మన దగ్గర లేదా అన్నా...?
6. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు మాత్రమే దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ వాళ్లను పట్టించుకునే నాధుడు లేడు కనీసం మీరు వెళ్ళి ఉన్న మిమ్మల్ని చూసి 4 కంపెనీలయినా వచ్చేవి...
7. రాష్ట్ర ప్రజల డబ్బుతో అంత దూరం వెళ్లి ఇక్కడ చేసిది చాలదని, అక్కడ జాకీలు పెట్టి లేపుకునే ప్రయత్నం, లేపలేనంత బరువు ఆయన కింద ఉన్నప్పుడు ఎన్ని జాకీలు వాడితే ఏం లాభం ?
8. కనీసం ప్రతిపక్షంలో ఉన్నా మనకు మంచి పేరు ఉంటుంది. లేకపోతే ఆ దరిద్రం అంతా మన నెత్తికి చుట్టుకుంది అన్నా, తట్టుకోలేక పోతున్నాం అన్నా నువ్వు చూసే ఆ ఫోటో చూసి.. అని వైసీపీ కార్యకర్తలు వేసిన ఫ్లెక్సీ సెన్సేషన్ అయింది.
Also Read: Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
YSRCP కార్యకర్త దేనికైనా / ఎవడికైనా భయపడతారా?
వైఎస్సార్ సీపీకి, పార్టీ కార్యకర్తలకు కష్ట కాలంలో అండగా ఉండి ముందుండి నడిపించి రోజు పలు కారణాలతో పార్టీకి దూరమైన నాయకులకు ఎక్కడున్నా ఏ రంగంలోకి పోతున్నా అంతా మంచే జరగాలి అని ఆశిస్తాం. "కట్టే కాలే" వరకు పార్టీకి, జగన్ అన్నకి అండదండగా ఉండే సగటు కార్యకర్త. పార్టీ వదిలి వెళ్ళే వాళ్లు పార్టీ నాకు ఏమి ఇచ్చింది. ఏం ఇస్తుంది అని కాకుండా. పార్టీకి మనం ఏం ఇచ్చాం. ఇక మీద ఏం ఇవ్వగలమని ఆలోచించండి. అలాచేస్తే పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది.
నేతలు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీని నడిపించేది మా లాంటి కార్యకర్తలే. అలాంటి ఆస్తి జగన్ (YS Jagan) అన్న సొంతం... ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఆ ఆస్తిని జగన్ అన్న నుంచి ఎప్పుడు దూరం చెయ్యలేదు. అలా చెయ్యటానికి ప్రయత్నిస్తే అంతకుమించి తిరగపడటం మా నైజం. 164/175, 11/175 ఈ రెండింటికి మధ్య నక్కకి, నాగ లోకానికి మధ్య ఉన్నంత తేడా ఉన్ననటికీ జగన్ అంటే మీరు నిద్ర పట్టక భయంతో వణికిపోతున్నారు. దానికి కారణం పార్టీని నడిపించే కార్యకర్తల బలం మా సొంతం. పొయ్యే వాళ్ళు త్వరగా పోండి. మా కార్యకర్తలకి న్యూ జనరేషన్ లీడర్స్ ను తయారు చెయ్యడం కొత్తేమీ కాదు, టన్నుల కొద్దీ నాయకులను తయారు చేస్తాం.
జగన్ లో ఉన్న పట్టుదల, మనధైర్యం, కష్టానికి భయపడకుండా ఎదురెళ్లి పోరాడే మొండితనం, ఏ పార్టీ వారైనా సరే అందరినీ సమానంగా చూడాలనే మంచితనం, కుల మతాలకి అతీతంగా పాలన అందించేలా నిర్ణయాలు తీసుకోవడం అన్నకే సొంతం.
YSRCP కార్యకర్త అంటేనే ఒక బ్రాండ్. మాకు మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉండదు. కూటములను చీల్చాలని ఉండదు. మాకు స్వలాభం అస్సలు ఉండదు మాకు ఉన్న ధైర్యం, మాకు ఉన్న పౌరుషం మా జగన్. ఆ జెండా పట్టుకోవడమే మా అజెండా. ఆ జెండా ఎప్పటికీ ఎవ్వడు మా నుంచి దూరం చెయ్యలేడు. చివరికి మమ్మల్ని పాతి పెట్టిన సమాధిపై కూడా జగన్ అన్న చిరునవ్వుతో ఉండే జెండా రెపరెపలాడుతుంది. జగన్ బ్రాండ్ అంటే ఏందో తెలుసునా మీకు.. తిప్పరా మీసం, చరచరా జబ్బ కొట్టరా తొడ, ఎన్ని కష్టాలొచ్చినా దీనెవ్వ తగ్గేదే లా... అది మా బ్రాండ్ అంటే. జై జగన్... జోహార్ YSR అనే ఫ్లెక్సీలు కడపలో దర్శనమిచ్చాయి.