ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. పదకొండు మంది వైరస్ బారిన పడి మరణించారు.
ఆంధ్రప్రదేశ్‌లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. లక్షా ఆరువందల ఇరవై రెండు మంది ప్రస్తుతం వైరస్‌తో బాధపడుతున్నారు. వీరిలో ఇరవై నాలుగు గంటల్లో పదకొండు వేల రెండు వందల ఎనభై మంది బాధితులు వైరస్ బారి నుంచి సురక్షింతగా కోలుకున్నారు. వాళ్లందరికీ నెగటివ్ వచ్చినట్టు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై నాలుగు గంటల్లో ముప్ఫై ఐదుల వేల నలభై మందికి పరీక్షలు చేయగా ఐదువేల తొమ్మిది వందల ఎనభై మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఏడువందల నలభై ఒక్కమంది వైరస్ బారిన పడగా... గుంటూరు జిల్లాలో ఏడువందల ముప్ఫై ఎనిమిది కేసులు బయటపడ్డాయి. కృష్ణా జిల్లాలో ఆరువందల పద్దెనిమిది, కడప జిల్లా ఆరువంద ఎనిమిది కేసులు వెలుగులోకి వచ్చాయి.
Also Read: దేశంలో నిన్న ఒక్కరోజులో 1,733 కరోనా మరణాలు.. కొత్తగా లక్షన్నర మందికి కొవిడ్