Farmers in AP are not getting remunerative prices for their crop: ఆంధ్రప్రదేశ్‌లో రైతులు పంట చేతికి వచ్చిన ప్రతీ సారి ఇబ్బంది పడుతున్నారు. మొదట తోతాపురి మామిడి కాయలకు డిమాండ్ లేక ఆందోళన చెందారు. తర్వాత ఉల్లి పంట పరిస్థితి అదే. ఇప్పుడు అరటి పంటలకూ డిమాండ్ ఉండటం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో తోతాపురి మామిడి రైతులు ధరలు పడిపోవడంతో రూ.1,000 కోట్ల నష్టం చవిచూశారు. సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు పడిపోయి, కర్నూల్, కడప జిల్లాల్లో రైతులు పంటను పారబోశారు. ఇప్పుడు అరటి పంటలకూ అదే పరిస్థితి వచ్చింది.
చేతికొస్తున్నపంటలకు దక్కని మద్దతు ధరలు
ఆంధ్రప్రదేశ్‌లో 18 ముఖ్య ఆహార పంటల్లో మామిడి, ఉల్లి, అరటి ప్రధానమైనవి. 2024-25లో మామిడి పంటలు అధిక ఉత్పత్తి ధర తగ్గుబాటు కారణంగా రైతులు భారీ నష్టం చవిచూశారు. ప్రభుత్వం కొంత సాయం చేసింది. సెప్టెంబర్‌లో ఉల్లి రైతులకు అదే సమస్య వచ్చింది.ఇప్పుడు అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు. డిమాండ్ , ఎగుమతులు తగ్గడం, లోకల్ మార్కెట్ స్థిరత్వం లేకపోవడం వల్ల ధర పడిపోయాయి. 2025లో ఆంధ్రలో హార్టికల్చర్ పంటలు 30 శాతం పెరిగింది. కానీ మద్దతు ధర విధానం సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు లాభాలు పొందలేకపోతున్నారు. ఫలితంగా, రైతుల ఆదాయం 40 శాతం తగ్గిందని చెబుతున్నారు.
ఉల్లి, తోతాపురి రైతులకు ఏపీ ప్రభుత్వ సాయం
సెప్టెంబర్ 2025లో ధరల పతనంతో రూ.50,000/ హెక్టారుకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. - 24,000 మంది రైతులు ప్రయోజనం పొందారు. నవంబర్ 2025లో మార్కెట్ ధరలు మెరుగుపడ్డాయి. జూలై 2025లో కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) ఆమోదించి తోతాపురి రైతులకు రూ.1,490 క్వింటాల్ మద్దతు ధర నిర్ణయించింది. రాష్ట్రం రూ.4 కేజీ సబ్సిడీ మొత్తం రూ.260 కోట్లు ఇచ్చింది. అక్టోబర్ 2025లో రూ.172.84 కోట్లు 37,881 మంది రైతుల అకౌంట్లలో జమ చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రైతులు ప్రధానంగా ప్రయోజనం పొందారు.
పంటలు ఎక్కువగా పండటం వల్ల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతు పథకాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంబించడం వంటి చర్యలు ప్రకటించింది. అరటి పంటలకు MSP ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామనిప్రకటించారు. కానీ, ఇదంతా పేపర్ల మీదనే ఉన్నాయని రైతుల వరకూ వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతుంది. ఇన్‌పుట్ సబ్సిడీలు, కోల్డ్ స్టోరేజ్ సమస్యలు ఉండటంతో రైతులు మధ్యవర్తుల చేతిలో మోసపోతున్నారు. 2025లో హార్టికల్చర్ పంటలకు 1500 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ, గ్రౌండ్ లెవల్‌లో అమలు జరగడం లేదు. పంటలు అనూహ్యంగా ఎక్కువగా పండటం వల్ల ఇతర చోట్ల డిమాండ్ తగ్గిపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎంత సాయం చేసినా రైతులు మాత్రం నష్టపోతూనే ఉన్నారు.