Andhra Liquor Scam ED: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి PMLA, 2002 కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ NCR మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఇరవై ప్రదేశాలలో 18.09.2025న సోదాలు నిర్వహించామని ఈడీ ప్రకటించింది. నకిలీ , అక్రమ లావాదేవీల ద్వారా ముడుపుల చెల్లింపుకు దోహదపడిన సంస్థలు , వ్యక్తుల ప్రాంగణాల్లో సోదాలు జరిగాయని.. సోదాల సమయంలో, లెక్కల్లో లేని రూ. 38 లక్షల నగదు, వివిధ నేరారోపణ పత్రాలు , డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకుని స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో YSRCP ప్రభుత్వ కాలంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఈన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) 2002 కింద హైదరాబాద్ జోనల్ ఆఫీసు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూర్, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ-NCR, ఆంధ్రప్రదేశ్‌లో 20 చోట్ల దాడులు జరిగాయి. ముఖ్యంగా లంచాలు చెల్లించడానికి బోగస్/ఇన్‌ఫ్లేటెడ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మనీ లాండరింగ్ చేసిన వ్యక్తులు, సంస్థల మీద దాడులు జరిగాయి. రూ. 3,500 కోట్ల మోసానికి సంబంధించిన ఈ దర్యాప్తు YSRCP అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వర్గాలతో ముడిపడి ఉన్నట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
ఈడీ హైదరాబాద్ జోనల్ టీమ్‌లు సెప్టెంబర్ 18 మధ్యాహ్నం నుంచి 20 చోట్ల దాడులు చేపట్టాయి. హైదరాబాద్‌లో మద్యం వ్యాపారులు, లావాదేవీలు చేసిన వ్యక్తుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. బెంగళూరులో మద్యం సంబంధిత సంస్థలు, తంజావూర్ లో హవాలా సంస్థలు, గుజరాత్‌లో ఫేక్ ఇన్‌వాయిస్‌లు జారీ చేసిన సంస్థలు, చత్తీస్‌గఢ్‌లో మద్యం డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, ఢిల్లీలో లంచాలు చెల్లిచిన వ్యక్తులు, అమరావతి, విజయవాడ వంటి ప్రదేశాల్లో YSRCP నేతలు, మద్యం వ్యాపారుల ఇళ్ల్లో సోదాలు జరిగాయి.
దాడులు ముఖ్యంగా ఆరెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీ జ్యువెలర్స్ ఎక్స్‌ఇంప్ వంటి సంస్థల మీద జరిగాయి. ఈ సంస్థలు మద్యం వ్యాపారంలో ఫేక్ బిల్లులు జారీ చేసి, కిక్‌బ్యాక్‌లు చెల్లించడంలో పాత్ర పోషించాయని ఈడీ అనుమానం. దాడులు ముందస్తు సమాచారం ఆధారంగా జరిగి, టీమ్‌లు రాత్రి వరకు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య YSRCP ప్రభుత్వం కాలంలో మద్యం విధానం మార్పులతో రూ.3,500 కోట్ల మోసం జరిగిందని ఈడీ ఆరోపణ. ఏపీసీఐడీ అధికారులు ఇప్పటికే ప్రత్యేక ద్రయాప్తు బృందంగా దర్యాప్తు చేస్తున్నారు.