Earthquake In Prakasam District | ప్రకాశం జిల్లాలో పలుచోట్ల మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. వరుసగా మూడోరోజు భూమి కంపించడంతో ప్రజలు ప్రాణభయంలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలోని సింగనపాలెం, ముండ్లమూరు, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో సోమవారం నాడు భూ ప్రకంపనలు వచ్చాయి. శనివారం, ఆదివారం సైతం ఈ ప్రాంతాల్లో భూమి కంపించింది.
ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో శనివారం, ఆదివారం సైతం భూమి కంపించింది. వరుసగా మూడు రోజులు భూమి కంపించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఆదివారం ముండ్లమూరు మండలంలో భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైంది. శనివారం సైతం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు, మారెళ్ల గంగవరం, తాళ్లూరు, వేంపాడు, రామభద్రాపురం, పోలవరం, శంకరాపురం, పసుపుగుల్లు, సింగన్నపాలెంలలో భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.