Kurnool Bus Fire Accident: కర్నూలు: మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాల సేకరిస్తామన్నారు సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంటుకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఘటన స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
ఫోరెన్సిక్ వైద్యులను ఘటన స్థలానికి పంపించాం. మృతదేహాల తరలింపునకు మహాప్రస్తానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. 12 మంది స్వల్పగాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉంది" అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
కర్నూలులో ట్రావెల్స్ ప్రమాదంపై హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305
కర్నూలుప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059
ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 94946098149052951010