DL Comments :   వైఎస్ఆర్‌సీపీకి ఈ సారి సింగిల్ డిజిట్  సీట్లే వస్తాయని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. గత ఎన్నికలకు ముందు తన ఇంటికి ప్రత్యేక దూతల్ని పంపించి మరీ పార్టీలో చేర్చుకున్నారని.. ఇప్పటికీ తాను వైసీపీలోనే ఉన్నానని ప్రకటించారు. వైసీపీ వాళ్లేమీ తనను తీసేయలేదని డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని ఆయన మండిపడ్డారు.  పరిపాలన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారు.. ఆ పార్టీలో నేను ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉందని  వ్యాఖ్యానించారు. 


వైఎస్ఆర్‌సీపీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తే గొప్ప !


రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నార.ు  గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్ల ోఎవరూ కాపాడలేరని.. ఒక్క చంద్రబాబు మాత్రమే కాపాడగలరన్నారు.  పవన్ కల్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేం కానీ  ఆయనకు అనుభం లేదని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.  రాష్ట్రం కోసం వారిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఏవర్గం ప్రజలు సంతృప్తికరంగా లేరని అన్నారు. దోచుకోవడమే తప్ప జగన్ కు ఈ నాలుగేళ్లలో రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు.  


వివేకా హత్య కేసులో జనవరి నుంచి కీలక మలుపులు


వైఎస్ వినేకానందరెడ్డి హత్య కేసులో  జనవరి 3 నుంచి  కీలక మలుపులు  ఉంటాయని డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు.   వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించిందన్నారు.  జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్నాయని.. సుప్రీం తీర్పు తర్వాత వివేకా కేసులో జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు.  చాలామంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉందన్నారు.  వివేకా కేసులో ఒంటరిగా పోరాడుతున్న ఆయన కుమార్తె సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చని డీఎల్ వ్యాఖ్యానించారు. 


వైఎస్ఆర్‌సీపీలో చేరినా ప్రాధాన్యం దక్కకపోవడంతో డీఎల్ అసంతృప్తి 
 
కడప జిల్లా మైదుకూరు నుంచి 1978 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ఘన విజయం సాధించారు డీఎల్ రవీంద్రా రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా వున్నారు. టీడీపీలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ.. స్థానిక నేత పుట్టా సుధాకర్ యాదవ్ బలంగా వుండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే 2019లో వైసీపీకి జై కొట్టిన డీఎల్‌కు జగన్ సరైన గుర్తింపునివ్వలేదని... ఎవరూ పట్టించుకోకపోవడతో ఆయన వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఆయనను బుజ్జగించేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నించడం లేదు. 


రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపిందా ? - రుషికొండ తవ్వకాల విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు !