Margadarsi Case: మార్గదర్శి చిట్ ఫండ్ కేసులు తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మార్గదర్శి వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవి కనిపించడం లేదని పిటిషన్ కొట్టేసింది. మార్గదర్శి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణపై స్టే కావాలనుకుంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని తేల్చి చెప్పింది. కేసును కొట్టేస్తే పిటిషన్లన్నీ నిరర్థకమే కదా అని వ్యాఖ్యానించింది సుప్రీం. ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్ వేసుకోవాలని సుప్రీం సూచించింది.
Margadarsi Case: కేసుల బదిలీలపై మార్గదర్శికి సుప్రీం కోర్టులో నిరాశ
ABP Desam | 02 Feb 2024 11:36 AM (IST)
Margadarsi Case Updates: ఏపీలో రిజిస్టర్ అయిన కేసులన్నీ తెలంగాణకు బదిలీ చేయాలన్న మార్గదర్శి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. స్టే కావాలంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
కేసుల బదిలీలపై మార్గదర్శికి సుప్రీం కోర్టులో నిరాశ