ఎపీ రాజదాని అంశం పై వెలువడిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఎపీ హై కోర్టు ఇచ్చిన తీర్పు తో అమరావతి రాజదాని రైతులు స్వాగతిస్తుంటే, ఎపీ సర్కారు మాత్రం చాలా లైట్ తీసుకుంది.ఈ తీర్పు ముందే ఊహించిందే కదా అని మంత్రి బోత్సా సత్యానారయణ వ్యాఖ్యానించారు. మూడు రాజదానులు రాష్ట్ర అభివృద్ది తమ అభిప్రాయమని అన్నారు. అటు బీజేపి నేతలు కూడా కోర్టు తీర్పును ఉద్దేశించి జగన్ ప్రభుత్వం పై తమదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికయినా ప్రభుత్వం మారకుంటే ఇక వారి ఖర్మ అంటూ బీజేపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు.వామపక్ష పార్టిలు కూడ కోర్టు తీర్పును స్వాగతించాయి. ఎపీ సర్కారు ఇప్పటికయినా కళ్ళు తెరవాలని సీపీఐ, సీపీఎం నాయకులు సూచించారు.
అమరావతి రాజదాని ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచారు, బాణా సంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు.ఎపీ హైకోర్టు వద్ద మోకాళ్ళ పై కుర్చొని కృతజ్ఞతలు తెలిపారు. సాష్టాంగ ప్రణామాలు చేసి న్యాయం గెలిచిందని నినదించారు. రాజదాని కోసం న్యాయస్దానం ఇచ్చిన తీర్పుతో అయినా జగన్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని అన్నారు. ఎలాంటి వారయినా సరే న్యాయస్దానం ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని సూచించారు.హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైఎస్ఆర్‌సీపీ మినహా మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ముక్త కంఠంతో ఆహ్వనించాయి.
అయితే మూడు రాజధానులు అంశం పై ఇప్పటికే ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది.మూడు రాజదానుల బిల్లును వెనక్కి తీసుకోవటంతో పాటుగా సీఆర్డీఎ బిల్లును రద్దు చేస్తున్నట్లు అసెంబ్లి సాక్షిగా ప్రకటించింది.ఈ అంశాన్ని మరింత లోతగా అద్యయనం చేసి తిరిగి అసెంబ్లిలో మూడు రాజదానుల అభివృద్ది బిల్లును ప్రవేశపెడతామన్నారు.ఇదే విషయం పై గవర్నర్ కూడ తన ప్రసంగంలో ప్రస్తావించారు.ఇప్పటికే మూడు రాజదానుల బిల్లు పై అసెంబ్లి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.అయితే ఈ లోపే బడ్జెడ్ సమావేశాలు వచ్చాయి. మార్చి 7వ తేదీన జరిగే అసెంబ్లి సమావేశం తరువాత .. మరో అసెంబ్లి సెషన్ లో మూడు రాజదానులు అంశం పై చర్చకు సభను సమావేశపర్చే అవకాశం ఉంది.
ఇప్పుడు హై కోర్టు ఇచ్చిన తీర్పు తో మూడు రాజదానులకు సంబందించిన అంశం పై బడ్జెట్ సమావేశాల్లోనే, గవర్నర్ ప్రసంగంలో మరో సారి ప్రస్తావించే అవకాశం కూడ లేకపోలేదని చెబుతున్నారు. మూడు రాజదానులు పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు సవాల్ చేసినప్పటికి, ఆ బిల్లును అసెంబ్లిలో వెనక్కి తీసుకున్నారు. కాబట్టి కొత్తగా ప్రభుత్వం తన వైఖరిని మరో సారి వెల్లడించే అవకాశాలు లేకపోలేదు. దీంతో వాట్ నెక్ట్స్ అనేది అటు రాజదాని రైతులతో పాటుగా, ప్రభుత్వ వర్గాల్లో కూడ చర్చనీయాంశంగా మారింది.