Vijay win with Jagan photo:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ ప్రభంజనం సృష్టించి, తన పార్టీ టీవీకేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టారు. అయితే, ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ మొదటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారని, జగన్ ఫోటోతో ప్రచారం చేయడం వల్లే ఆయనకు ఈ స్థాయి విజయం దక్కిందని ఆమె పేర్కొనారు.  తమిళనాడు ఎన్నికల్లో  డీఎంకే తరఫున ప్రచారం చేసిన రోజా, ఫలితాలు రాగానే విజయ్‌ను ఆకాశానికెత్తడంపై నెటిజన్లు ప్లేట్ మార్చేశారంటూ  విమర్శలు గుప్పిస్తున్నారు.

Continues below advertisement

ఆ రెండు సెకన్ల వీడియోనే అసలు కథా? 

నిజానికి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్ ఎక్కడా జగన్ ఫోటోను అధికారికంగా వాడలేదు. ఒక రోడ్ షో సందర్భంగా అభిమాని ఒకరు జగన్, విజయ్ కలిసి ఉన్న ఫోటోను అందించగా, దాన్ని ఆయన ఒక్క క్షణం పైకి ఎత్తి చూపించి తిరిగి ఇచ్చేశారు. ఆ రెండు సెకన్ల నాటి పాత దృశ్యాలను పట్టుకుని, విజయ్ గెలుపుకు జగన్ ఇమేజే కారణమని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రం గెలుపు క్రెడిట్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలనే తపనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Continues below advertisement

నాడు డీఎంకే.. నేడు టీవీకే: రోజా యూ-టర్న్! 

ఎన్నికల సమయంలో తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గెలుపు కోసం ప్రచారం చేసిన రోజా, ఇప్పుడు విజయ్ వైపు మొగ్గు చూపడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగన్ లాగే విజయ్ కూడా ఒంటరి పోరాటం చేశారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, డీఎంకేతో మిత్రపక్షంగా ఉన్న వైసీపీ నేతలు, ఇప్పుడు ఆ పార్టీని ఓడించిన విజయ్‌ను పొగడటం వెనుక ఉన్న రాజకీయ మతలబు ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  

 విజయ్ సొంత బ్రాండ్ వర్సెస్ వైసీపీ ప్రచారం 

విజయ్ తన సొంత సినిమా గ్లామర్, క్షేత్రస్థాయిలో చేసిన కేడర్ బిల్డింగ్,  డ్రవిడ రాజకీయాల్లో మార్పు కోరుకున్న యువత మద్దతుతో విజయం సాధించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు ఈ గెలుపును తమ నాయకుడికి ఆపాదించడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వినిపిస్తున్నాయి.  విజయ్ గెలిచింది ఆయన కష్టంతో, కానీ సంబరాలు మాత్రం తాడేపల్లిలో జరుగుతున్నాయా  అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మిన్నంటుతున్నాయి.      

 క్రెడిట్ వార్‌పై పెదవి విరుపు  పక్క రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి పుట్టుకొస్తే, దానికి తమ నాయకుడే స్ఫూర్తి అని చెప్పుకోవడం ఇప్పుడు వైసీపీ నేతలకు రివాజుగా మారింది. గతంలో కూడా ఇతర రాష్ట్రాల ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిన నేతలు, ఇప్పుడు విజయ్ విజయంపై చేస్తున్న వ్యాఖ్యలు వారిని విమర్శల పాలు చేస్తున్నాయి. అధికారం శాశ్వతం కాదని, ప్రజాభిప్రాయమే అంతిమ తీర్పు అని విజయ్ నిరూపిస్తే, ఆ క్రెడిట్‌ను హైజాక్ చేయడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.