Deputy CM Pawan Kalyan Criticized Jagan:  భారత రాజ్యాంగం అన్ని మతాలకూ ఒకేలా వర్తిస్తుందని, ధర్మం , రాజ్యాంగం ఒకే దిశలో మార్గదర్శకాలుగా పనిచేస్తాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా, హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండకూడదని ఆయన  స్పష్టం చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  మెజారిటీ పేరిట హిందువులు వివక్షకు గురవుతున్నారని  అన్నారు. హిందువులు మెజారిటీ అనేది ఒక భ్రమ. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా వారు విడిపోయి ఉన్నారు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సనాతన ధర్మ రక్షణ దేశంలోని ప్రతి హిందువుని బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.  తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయంలో దీపావళి దీపోత్సవ కార్యక్రమానికి మద్రాస్ హైకోర్టులో విజయం సాధించినా, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని  ఆయన ప్రశ్నించారు. హిందువులు తమ విశ్వాసాలు, ఆచారాలు పాటించడానికి కోర్టులు వెళ్లాల్సి పడటం దుర్భరం అన్నారు. సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటును ఆయన ప్రతిపాదించారు.  భక్తులు తమ ఆలయాలు, మతపరమైన కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకునేలా ఈ బోర్డు ఏర్పడాలి. కోర్టు విజయాలతో సరిపోదు, ఆచారాలు కాపాడాలి  అని తెలిపారు.   

Continues below advertisement

 తమిళనాడు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ డీఎంకే సూడో సెక్యూలిజంను పాటిస్తోందని విమర్శించారు. హిందూ సమాజ హక్కును కాపాడేలా ఓ న్యాయమూర్తి తీర్పు ఇస్తే..డీఎంకే నేతృత్వంలో 120 మంది ఎంపీలు అభిశంసన పిటిషన్ ఇచ్చారన్నారు. శబరిమల విషయంలో  తీర్పు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొన్నారే కానీ ఇలా అభిశంసన తీర్మానాలు చేయలేదన్నారు.  

Continues below advertisement