New Kia Seltos Price In India and Features | భారత్‌లో చాలా కార్లను విక్రయిస్తున్న సంస్థల్లో Kia Motors ఒకటి. కియా మోటార్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన SUV సెల్టోస్. ఇప్పుడు కియా మోటార్స్ తన Seltos కొత్త తరం మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కియా సెల్టోస్ SUV 2019లో మొదటిసారిగా భారతదేశంలో ప్రారంభించారు. ఇప్పుడు కంపెనీ దాని కొత్త వేరియంగ్, మోడ్రన్ వెర్షన్‌ను తీసుకువచ్చింది. కొత్త Seltos గురించి కియా కస్టమర్లు ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే డిజైన్ నుండి ఫీచర్ల వరకు కియా సెల్టోస్‌లో మార్పులు గమనించవచ్చు. కియా తీసుకొచ్చిన కొత్త వేరియంట్ మార్పులు, ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

Continues below advertisement

ఔట్ లుక్, ఇంటర్నల్ గా భారీ మార్పులు 

కొత్త తరం కియా Seltosకు సంబంధించి ఇదివరకే టీజర్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా కొత్త సెల్టోస్ లాంచ్ అయింది. కారు వెలుపల, లోపల రెండింటిలోనూ కొత్త డిజైన్ ఇచ్చారు. సెల్టోస్ SUVలో కొత్త LED DRL, కొత్త LED హెడ్‌లైట్, LED ఫాగ్ లైట్ సహా కొత్త రియర్ బంపర్ ఉన్నాయి. వెనుక భాగంలో హై మౌంట్ స్టాప్ లైట్, గ్లాస్ బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్ ఇచ్చారు. దీంతో పాటు కారులో షార్క్ ఫిన్ యాంటెన్నా,  కొత్త ORVMలు కూడా ఇచ్చారు. ఇంటీరియర్‌లో కూడా మార్పులున్నాయి. ఇందులో కొత్త డాష్‌బోర్డ్, మోడ్రన్ టచ్‌స్క్రీన్, కొత్త సీట్లు, మరింత ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. 

New Kia Seltos లాంచ్.. ధర ఎంతంటే

కియా కంపెనీ బుధవారం (డిసెంబర్ 10న) కొత్త తరం Kia Seltosను అధికారికంగా మార్కెట్లోకి తెచ్చింది. కియా Seltos ఎక్స్‌షోరూమ్ ధర రూ. 10.79 లక్షల నుండి ప్రారంభమై వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ. 19.80 లక్షల వరకు ఉంటుంది. కొత్త మోడల్ అన్ని వేరియంట్ల ధరలకు కంపెనీ ప్రకటించనుంది.

Continues below advertisement

ఏ కార్లకు గట్టిపోటీ

కొత్త Kia Seltos మిడ్-సైజ్ SUV కేటగిరిలోకి వస్తుంది. ఈ విభాగంలో ఇది మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara), హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), Honda Elevate, స్కోడా కుషక్ (Skoda Kushaq) వంటి SUVలకు గట్టి పోటీ తప్పదు. కియా Seltos ఇప్పటికే ఈ విభాగంలో అమ్మకాలలో దూసుకెళ్తోంది. ఇప్పుడు కొత్త కియా సెల్టోస్ మార్కెట్లోకి రావడంతో ఇతర ఆటోమొబైల్ కంపెనీల విక్రయాలపై ఇది ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కోసం డ్యూయల్ 12.3 అంగుళాల డిస్‌ప్లే సెటప్, ఇంటిగ్రేటెడ్ యాంబియంట్ లైటింగ్‌తో డ్యాష్‌బోర్డ్ మరింత క్లీన్‌గా ఉంటుంది. అప్‌డేట్ చేసిన స్విచ్‌గేర్‌తో కూడిన కొత్త స్టీరింగ్ వీల్ ఇచ్చారు. వెనక్కి తీసుకోగల కప్ హోల్డర్‌లతో కూడిన బలమైన కన్సోల్, చిన్నగా, కొత్తగా రూపొందించిన గేర్ సెలెక్టర్ ఫీచర్లు ఉన్నాయి.

కియా సెల్టోస్ ఫీచర్లు, భద్రతా అప్‌గ్రేడ్‌లు- పనోరమిక్ సన్‌రూఫ్- వైర్‌లెస్ ఛార్జింగ్- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు- 360-డిగ్రీ కెమెరా- అప్‌గ్రేడ్ చేసిన ప్రీమియం సౌండ్ సిస్టమ్- వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు- వెనుక సీటు సౌకర్యం కోసం బాస్ మోడ్ ఫంక్షన్