Deputy CM Pawan Kalyan inaugurated Palle Pandaga 2: ‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో 'పల్లె పండగ 2.0' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్    పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.  పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహిరంగసభలో మాట్లాడారు.  పల్లె పండగ  విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పవన్ తెలిపారు.   పల్లె పండగ 1.0 కార్యక్రమం ద్వారా రూ. 2,525 కోట్ల విలువైన పనులు టైం బౌండ్ విధానంలో పూర్తి చేశాం. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. పాడి రైతుల కోసం 22,500 మినీ గోకులాలు ఏర్పాటు చేశాం. మూగజీవాల దప్పిక తీర్చడానికి 15 వేల నీటి తొట్టెలు నిర్మించాం. లక్షకు పైగా నీటి కుంటలు ఏర్పాటు చేశాం.  ఇప్పుడు పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా రూ. 5,838 కోట్ల అంచనా వ్యయంతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు.  పాత రహదారులకు పునర్నిర్మాణం చేయబోతున్నాం. రూ. 375 కోట్ల వ్యయంతో 25 వేల మినీ గోకులాలు, రూ. 16 కోట్ల అంచనాతో 157 కమ్యూనిటీ గోకులాలు ఏర్పాటు చేస్తాం. రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. పంచాయతీల పరిధిలో రూ. 406 కోట్లతో 15 వేల కొత్త అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. రూ.148 కోట్లతో డీపీఆర్సీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం చేయనున్నాం.  వీటితోపాటు కోనసీమకు అదనంగా మరో రూ.100 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. 

Continues below advertisement

గత ఐదేళ్ల వైసీపీ పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే గుంతలుపడ్డ రోడ్లు, మరమ్మతులు నోచుకోని కాలువలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులు గుర్తుకొస్తాయి. గత ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వానికి వారసత్వంగా ఏదైనా వచ్చింది అంటే అవి అప్పులు, సమస్యలు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో నాయకుల దగ్గరకు వెళ్లి ఇది చేయండి అని అడిగే పరిస్థితి ఉండేది కాదు. మార్పు కావాలని యువత బలంగా తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు ప్రభుత్వం మారిపోయింది. అభివృద్ధి పనులకు వేల కోట్లు ఖర్చు చేయగలుగుతున్నామన ిగుర్తుచేశారు.   

గత ప్రభుత్వంలా మేము దోచుకోవడం లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం లేదు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నాం. అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పెన్షన్లు మీకంటే బలంగా ఇస్తున్నాం. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో ఇక్కడ విప్లవాలు వస్తాయని కొంతమంది నాయకులు కలలు కంటున్నారు. గత ప్రభుత్వం ఇంకో ఏడాది అధికారంలో ఉంటే అలాగే జరిగేది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి గొడవలు లేకుండానే ఓటు అనే ఆయుధంతో యువత ప్రభుత్వాన్నే మార్చేశారని అన్నారు.