Cyclone Montha Landfall Today | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  మొంథా తుపాన్ తీవ్రరూపం దాల్చుతోంది. నిన్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారగా, మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడుతుందని ఏపీ  విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మొంథా తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కి.మీ, కాకినాడకి  310 కి.మీ, విశాఖపట్నంకి  370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని #APSDMA పేర్కొంది. 

Continues below advertisement

రాత్రి తీరం దాటనున్న మొంథా తుపానుమొంథా తుపాను మంగళవారం రాత్రి మచిలీపట్నం- కాకినాడ మధ్య తీరం దాటే అవకాశంఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు రికార్డు అయ్యాయి. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి నేడు బయటకు రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

నేడు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు

మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఉత్తర కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులకు చెట్లు కూలిపోతున్నాయి. వర్షం కురిసే సమయంలో పాత భవనాల కింద గానీ, చెట్ల కిందకు వెళ్లి తలదాచుకోవడం ప్రమాదకరమని అధికారులు తెలిపారు.

జిల్లాల కంట్రోల్ రూమ్ నెంబర్లు..1. APSDMA రాష్ట్ర కంట్రోల్ రూమ్ నెంబర్లు  -   112, 1070, 1800 425 01012. శ్రీకాకుళం   -       08942-2405573. విజయనగరం  - 08922-2369474. విశాఖపట్నం  - 0891-2590102/1005. అనకాపల్లి   - 089242 228886. కాకినాడ   -  0884-23568017. BR అంబేద్కర్ కోనసీమ- 08856-2931048. వెస్ట్ గోదావరి  - 08816-2991819. కృష్ణుడు   - 08672-25257210. బాపట్ల   - 08643-22022611. ప్రకాశం   - i/c 984976489612. నెల్లూరు   - 0861-2331261, 799557669913. తిరుపతి   -  0877-2236007

రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS) కమాండ్ సెంటర్‌ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు.. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో కలిసి తుఫాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, జీరో రిస్క్ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 2,707  తుపాను ప్రభావిత గ్రామాలను గుర్తించి, 11 NDRF, 12 SDRF టీమ్స్, ఫైర్ సర్వీసెస్, స్విమ్మర్లు, OBM బోట్లు, లైఫ్ జాకెట్లు పంపించారు. 108/104 అంబులెన్స్ నెట్‌వర్క్, మెడికల్ క్యాంపులు రెడీ చేసి.. ఎమర్జెన్సీ  మెడిసిన్స్, బోట్ క్లినిక్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ మెడికల్ టీమ్స్ ను మొబిలైజ్ చేశారు.