Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

అర్నాబ్ తుపాను వాతావరణశాఖ ఊహించిన దాని కంటే చాలా వేగంగా దూసుకొస్తుంది. ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Advertisement

Shankar DukanamLast Updated: 28 Oct 2026 03:24 PM

Background

అర్నాబ్ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సన్నద్ధత, ముందస్తు చర్యలపై అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడికి అధికారులు సమగ్ర వివరణ ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే 11 జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్...More

హోంమినిస్టర్ ఆన్ డ్యూటీ... పాయకరావుపేట పునరావాస కేంద్రాల్లో తనిఖీలు 

బంగాళాఖాతంలో విరుచుకుపడిన 'అర్ణబ్' తుఫాన్ ధాటికి దెబ్బతిన్న గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని ఎస్. రాయవరం మండలం చిన్నగుమ్ములూరుతో పాటు పలు ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన ఆమె, తుఫాన్ బాధితులను కలిసి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పునరావాస కేంద్రాలను సందర్శించిన హోంమంత్రి.. అక్కడి ప్రజలకు అందుతున్న భోజన, వైద్య సౌకర్యాలను, తాగునీటి సరఫరాను స్వయంగా తనిఖీ చేశారు.  ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని, ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు.

Continues below advertisement
సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను క్లియర్ చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

అర్నబ్ తుఫాన్‌పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష


తుఫాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపుపై అధికారులతో సమీక్ష


కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం


జిల్లాల వారీగా పరిస్థితులను, గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను ముఖ్యమంత్రికి వెల్లడించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్
• విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
• కోనసీమలో సుమారు 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయినట్టు తెలిపిన అధికారులు
• కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల చెట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 వేల చెట్లు కూలిపోయినట్లు వివరణ 
• జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు వివరించిన అధికారులు.
• వివిధ ప్రాంతాల్లో కూలిన చెట్ల తొలగింపు పనులను మధ్యాహ్నం 3 గంటల నాటికి పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు.
• కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అధికారుల వెల్లడి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... తుఫాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం ఏపీసీపీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని పంపాలి
• పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయండి.
• కూలిన చెట్లను వెంటనే తొలగించి, సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలి.
• పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి. 
• వ్యవసాయం, ఉద్యానవన శాఖలతోపాటు వివిధ విభాగాలు తుఫాన్ నష్టం అంచనాలపై దృష్టి సారించాలి.
• పశుసంపదకు జరిగిన నష్టం, ఇళ్లు కూలిపోవడం, నీట మునగడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి.
• విద్యుత్, రహదారుల వ్యవస్థలకు జరిగిన నష్టాన్ని, చెరువులకు గండ్లు పడిన అంశాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించాలి.
• రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి.
• సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడంతోపాటు వరద నీటి నిర్వహణపై దృష్టి సారించాలి.
• విద్యుత్ సరఫరా, తాగునీరు, రాకపోకలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి.
• గత పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని 26 తుఫాన్లు తాకాయి. 
• గతంలో సంభవించిన దివిసీమ ఉప్పెనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 
• దివిసీమ ఉప్పెన, హుద్ హుదు, తిత్లీ తుఫాన్ల సమయంలో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. 
• వరదల సమయంలో అప్పటి ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవస్థలు విఫలమయ్యాయి. 
• బుడమేరు వరదల్లో విజయవాడ లోనే ఉండి వ్యవస్థను గాడిలో పెట్టగలిగాం
• ప్రస్తుతం అర్నబ్ తుఫానులో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.
• రాష్ట్రాన్ని తాకిన ప్రతి తుఫాన్ నుంచి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే పాఠాలను నేర్చుకుంటున్నాం
• టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలుగుతున్నాం
• అన్ని స్థాయిల్లో అధికారులు ఒకే విధమైన ఆలోచనతో పనిచేస్తూ, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి. 
• అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు, వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాం
• ప్రకృతి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా తక్షణ నిర్ణయాలు తీసుకుని, వాటిని సమర్థంగా అమలు చేయాలి
• గత రాత్రి నుంచి ఇప్పటివరకు నాలుగు మార్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పరిస్థితులు, సహాయక చర్యలను సమీక్షిస్తున్నాం

Continues below advertisement
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.