Mylavaram News :   అది ప్రభుత్వ ఆఫీసు. ప్రతి ఉద్యోగి వాటర్ బాటిల్ తెచ్చుకోవడం సహజం. కానీ అక్కడ ఉద్యోగులు మాత్రం వాటర్ బాటిళ్లతో పాటు  మద్యం ,  మంచింగ్‌కు స్టఫ్ కూడా తెచ్చుకుంటారు. ఓ వైపు ఆఫీసు పత్రాలు చూస్తూ.. మరో వైపు మద్యాన్ని సిప్ చేస్తూ ఉంటారు. ఆహా ఇంత భాగ్యం ఏ ఆఫీసులో కల్పించారని చాలా మంది ఈర్ష్యపడవచ్చు. కానీ ఎవరూ కల్పించలేదు. వారికి వారే కల్పించుకున్నారు. వారి పేర్లు పీర్ సాహెబ్, నాగరాజు.  


మైలవరం మార్కెట్ యార్డు కార్యాలయాన్ని బార్ గా మార్చిన ఉద్యోగులు


ఎన్టీఆర్ జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పీర్ సాహెబ్, నాగరాజు ప్రభుత్వ ఉద్యోగులు. ఉన్నతాధికారులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడం.. ఆఫీసులో వీరిదే ఇష్టారాజ్యం కావడంతో.. చేయాల్సిన ఘనకార్యాలన్నీ చేస్తున్నారు. చివరికి బరి తెగించి.. బార్ గా మార్చేశారు. ఆఫీసుకు వచ్చేటప్పుడు లంచ్ తెచ్చుకునే బ్యాగులోనే మద్యం బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. విధులు నిర్వహించే టేబుల్ మీదనే సిట్టింగ్ ప్రారంభిస్తున్నారు. రోజు రోజుకు ఇది మితిమీరి పోతూండటంతో..త ఓ వ్యక్తి వీరి నిర్వాకాన్ని వీడియో తీశాడు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 


వీడియో వైరల్ కావడంతో వ్యవసాయ మంత్రి చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ డిమాండ్ 


ఈ వీడియో వైరల్ కావడంతో.. ఉద్యోగుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని డిమాండ్ చేశారు. హక్కుల గురించి మాట్లాడే ఉద్యోగ సంఘాలు వారి నేతలు వీటిమీద ఎన్ని సంఘాలు స్పందిస్తారో చూడాలన్నారు. 





 ఉద్యోగులపై చర్యలకు సిఫార్సు చేసినట్లుగా ప్రకటించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ 


ఈ ఇద్దరు ఉద్యోగుల వ్యవహారం.. ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వారిద్దరిని విధుల నుంచి తతప్పిస్తున్నట్లుగా మైలవరం మార్కెట్ యార్డ్ కమకిటీ చైర్మన్ సతనారాయణ రెడ్డి ప్రకటించారు. విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.  ఉద్యోగుల వ్యవహార శైలి మొదటి నుంచి అంతే ఉండేదని.. చేయాల్సిన పనులు కూడా చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెడతారన్న ఆరోపణలు  ఉన్నాయి. ఇటీవలి కాలంలో వారు మరింత  దిగజారిపోయి.. ఆఫీసులోనే సిట్టింగులు పెడుతూంటంతో.. కొంత మంది వారి బండారాన్ని బయ ట పెట్టాలని డిసైడయి.. ఈ వీడియోను  తీసి వైరల్ చేసినట్లుగా భావిస్తున్నారు.  ఈ ఉద్యోగుల వ్యవహారంపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ల


హైకోర్టులోనే జీవో నెంబర్ 1పై విచారణ - ఏపీ సర్కార్ పిటిషన్ పై విచారణ ముగించిన సుప్రీంకోర్టు !