ఏపీలో కరోనా పాజిటివ్ కేసులలో గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోల్చితే తగ్గగా.. కొవిడ్ మారణాలు మాత్రం భారీగా పెరగడం ఆందోళన పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,145 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 17 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,25,900 పాజిటివ్ కేసులకు గాను 19,96,756 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,157 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
ఏపీలో ఇప్పటివరకూ 13,987 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. మరోవైపు యాక్టివ్ కేసులు నిన్నటితో పోల్చితే పెరిగాయి. రాష్ట్రంలోనూ ప్రమాదకర ఏవై 12 కేసులు నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో 1,090 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజా పాటిజివ్ కేసులతో పోల్చితే కోలుకున్న వారు తక్కువగా ఉన్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: వాక్సినేషన్ పూర్తయిన వారికి గుడ్ న్యూస్.. తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే..?
కొవిడ్ బారిన పడి అధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 72 లక్షల 79 వేల 362 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 216, నెల్లూరు జిల్లాలో 173 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా, కర్నూలు జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 7 మంది కరోనా బారిన పడ్డారు.
Also Read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం
తెలంగాణలో ఇలా..
తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులను గుర్తించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,302 కు చేరింది. 322 మంది శుక్రవారం నాడు కోలుకున్నారు. ఒకరు కరోనా వల్ల చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3,893 కు చేరింది. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారు 5,324 మంది ఉన్నారు.