ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 800 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,51,768కు చేరుకుంది. నిన్న ఒక్కరోజులో మరో 9 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,228కు చేరుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం మొదట్నుంచీ కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంది.
మెరుగ్గా రికవరీలు..
ఏపీలో నిన్న ఒక్కరోజులో 1,178 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. తాజాగా కరోనా పాజిటివ్ కేసులతో పోల్చితే, డిశ్ఛార్జ్ కేసులు అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 8,754కు దిగొచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో 128 మందికి కరోనా సోకింది. చిత్తూరులో 120, గుంటూరులో 111, పశ్చిమ గోదావరిలో 104 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ముగ్గరికి, విజయనగరం జిల్లాలో 8 మందికి కరోనా సోకిందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. భారీ బోనస్ ప్రకటించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష..
COVID-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్ హబ్స్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొని ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కరోనా వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు, ప్రస్తుత పరిస్థితులను వివరించారు.
Also Read: రోజుకో క్యారెట్... ఎన్నో అనారోగ్యాలకు పెట్టొచ్చు చెక్... అధిక బరువు నుంచి కంటి చూపు మెరుగు వరకు
రాష్ట్రంలో ఇప్పటివరకూ సింగిల్ డోసు వ్యాక్సినేషన్ 1,38,32,742కు పూర్తి కాగా, రెండు డోసుల వ్యాక్సినేషన్ 1,44,94,731కు పూర్తయింది. 2,83,27,473 మందికి వ్యాక్సినేషన్ జరగగా.. వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన మొత్తం డోసుల సంఖ్య 4,28,22,204 అని ఏపీ సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.