Coromandel Express Accident in Odisha: అమరావతి: ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసింది. బాధితుల సమాచారాన్ని తెలిసేందుకు, డెడ్ బాడీస్ గుర్తించేందుకు అక్కడి నుంచి అందిన సమాచారాన్ని ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వం నుండి అందిన వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్‌లో 120 గుర్తుతెలియని మృతదేహాలు లభించాయి. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని, 1929 నెంబర్ లో సంప్రదించవచ్చు. మరణించినవారిని గుర్తించడానికి NoKలను వివిధ ఆసుపత్రులలోని మార్చురీలకు తీసుకెళ్లడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఏదైనా సహాయం అవసరమైతే, వారు సంప్రదించగలరు. 
తిరుమల నాయక్ ఐఏఎస్  88953 51188


వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రయాణికుల జాబితాలు కింద పేర్కొన్న వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేశారు. 
https://srcodisha.nic.in/
https://www.bmc.gov.in
https://www.osdma.org


మరణించిన ప్రయాణీకుల జాబితా, ఫొటోలు కూడా గుర్తింపును సులభతరం చేయడానికి పై వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేశారు.
- బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన వారి ఫొటోస్ గుర్తింపును సులభతరం చేయడానికి మాత్రమే పోస్ట్ చేయబడుతున్నాయి.
- ప్రమాదం యొక్క స్వభావాన్ని బట్టి, పోస్ట్ చేయబడిన చిత్రాలు కలవరపెడుతున్నాయి.
- పిల్లలు ఈ చిత్రాలను చూడకుండా ఉండాలని సూచించబడింది.
- ఏదీ (మీడియా/వ్యక్తిగతం/సంస్థలు మొదలైనవి) స్పెషల్ రిలీఫ్ కమీషనర్, ఒడిషా యొక్క ముందస్తు రాత ఆమోదం లేకుండా చిత్రాలను ప్రచురించకూడదు & ఉపయోగించకూడదు అని ఒడిశా ప్రభుత్వం సూచించింది..


మునిసిపల్ కమిషనర్ కార్యాలయం, భువనేశ్వర్, కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి నుండి వాహనాలతో, ప్రజలు ఆసుపత్రికి లేదా మార్చురీకి తీసుకెళతారు. సౌకర్యాలు కల్పించేందుకు అధికారులను నియమించారు.


BMC హెల్ప్‌లైన్ నంబర్ 1929
అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు
1. కటక్ రైల్వే స్టేషన్, బస్టాండ్ & SCB మెడికల్ కాలేజీ.
2. భువనేశ్వర్ రైల్వే స్టేషన్, బారముండా బస్ స్టాండ్ వద్ద, విమానాశ్రయం వద్ద హెల్ప్ డెస్క్.


 ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోరమండల్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. సీబీఐ సమగ్ర దర్యాప్తుతో ప్రమాదానికి కారణాలు, బాధ్యులెవరో తేలుతుందన్నారు. రైలు ప్రమాదం ఘటనలో ఇప్పటికే 275 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. కొందరి డెడ్ బాడీలను గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించగా, 170 నుంచి 180 వరకు డెబ్ బాడీలను గుర్తించలేదని, అవి కుళ్లిపోయే అవకాశం ఉండటంతో గుర్తించడం కష్టమేనని కొందరు అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ రైలు ప్రమాదం ప్రపంచ దేశాలను సైతం కలచివేసింది. మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఆ తరువాత హౌరాకు వెళ్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు.. కోరమండల్ బోగీలను ఢీకొట్టడంతో భారీ విషాదంగా మారింది.