Congress leader Tagore on Jagan: స్టోరీలు వద్దు.. ఓట్ల చోరీ అంశంపై రాహుల్ పోరాటాన్ని అభినందించాలి. మద్దతు పలకాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూడా ఓట్ చోరీ జరిగిందని కానీ రాహుల్ ఇక్కడి అంశాలపై మాట్లాడటం లేదన్నారు . చంద్రబాబు, రేవంత్, మోదీ మధ్య హాట్ లైన్ ఉందన్నారు. అందుకే మాట్లాడటం లేదన్నారు. అలాగే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఏపీలో జరుగుతున్న అవినీతిపై మాట్లాడటం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ వెంటనే స్పందించారు.
నిజాయితీ ఉంటే షర్మిల ర్యాలీలో పాల్గొనాలి!
కథలు చెప్పవద్దని.. ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి మద్దతుగా పోరాటానికి రావాలని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలో ఓటు చోరీకి వ్యతిరేకంగా షర్మిల ర్యాలీ చేస్తున్నారని అందులో పాల్గొనాలన్నారు. రాహుల్ గాంధీ.. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని.. రాజకీయం కోసం కాదన్నారు. కేసుల కోసం అమిత్ షా ,మోదీకి సరెండర్ అయిపోయి రాహుల్ పై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించరాు. జగన్ మోహన్ రెడ్డిలా రాహుల్ గాంధీ ఎవరికీ సరెండర్ కాలేదన్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
ఎన్నికల్లో తప్పులు జరిగిదే మోదీ, షా, ఈసీని కదా ప్రశ్నించాల్సింది !
జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీ ఎన్నికల్లో ఓట్ల చోరీ అక్రమాలు జరిగితే., తప్పులు జరిగితే ఈసీ, మోదీ, షాను తప్పు పట్టాలి.. రాహుల్ ను కలిసి పోరాడుతున్న దానికి మద్దతు పలకాలి కానీ ఇలా మాట్లాడుతున్నారేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రాహుల్ ఓట్ల చోరీ పోరాటానికి మద్దతు తెలుపని జగన్ మోహన్ రెడ్డి
ఎన్నికల్లో ఓట్ల అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపిస్తున్నారు. ఈవీఎంలతోనే ఓడిపోయామని అంటున్నారు. కానీ రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓట్ల చోరీ ఉద్యమానికి ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. కానీ ఏపీలో లోపాలు జరిగాయని వాటిపై రాహుల్ స్పందించడం లేదని అంటున్నారు. ఏపీలో అక్రమాలు జరిగాయని అంటున్న ఆయన మాత్రం మోదీ , ఈసీ, అమిత్ షాలపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడాలని అంటున్నారు. ఇదే రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. అలా మాట్లాడకపోతే.. చంద్రబాబు, రేవంత్, రాహుల్ మధ్య హాట్ లైన్ ఉన్నట్లేనని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ అంశంపై ఏపీలోనూ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పుడు జగన్ మద్దతు పలకాలని కాంగ్రెస్ నేతలంటున్నారు. కానీ కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే బీజేపీకి కోపం వస్తుందని జగన్ .. ధైర్యం చేయలేకపోతున్నారని అంటున్నారు.