Case Om RGV : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క  సీరియస్ అయింది. ఆమె అసలు శిరీష. బర్రెలక్క పేరుతో ఫేమస్ అయ్యారు. ఆమె ఇటీవల కొల్లాపూర్ ఎన్నికల్లో పోటీ చేశారు. పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి ఆమెను పేరును ఉపయోగించుకుంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా వ్యూహం సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్క పై చేసిన కామెంట్లు.. వివాదాస్పదమయ్యాయి. మె తరపున లాయర్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో కేసు నమోదు చేశారు. 


రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది, బర్రె లెక్క కాస్త ఉంటుంది, బర్రెలు లక్క ఆమె మాట కూడా వింటున్నారు, అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని పేర్కొన్నట్టు సదరు లాయర్ ఉమెన్స్ కమిషన్ కు ఫిర్యాదు  చేశారు.    రామ్ గోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు అని లాయర్ మండిపడ్డారు.  ఈ విషయం మీద మరింత పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి మాటలు వద్దు ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతాం అని ఆయన హెచ్చరించారు.బర్రెలక్క అనే పేరుతో ఫేమస్ అయిన తెలంగాణ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన కర్నె శిరీష మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆస్టేట్ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదన్నారు.  


మరో వైపు వ్యూహం సినిమా నిలిపవేయాలని  నారా లోకేష్ హైకోర్టులో దాఖులు చేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి.   అసలు నారా లోకేశ్ వేసిన రిట్ పిటిషన్ పరిగణలోకి రాదని, రిట్ పిటిషన్ మైనటనబుల్ కాదని ఆర్జీవీ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి  పేర్కొన్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డు కమిటీ ఉంటుంది. ఒకవేళ సినిమా పై ఏమైనా అబ్జెక్షన్ చేయాలి అనుకుంటే అక్కడ చేయాలని చెప్పుకొచ్చారు. కానీ సెన్సార్ బోర్డు ఎలాంటి అడ్డు చెప్పకుండా వ్యూహం చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా వ్యక్తులను, పార్టీలను కించపరిచే విదంగా సినిమా ఉంటే సివిల్ కోర్టులో పరువు నష్ట దావా వేసుకోవాలి గాని హైకోర్టులో వేయ్యడం కరెక్ట్ కాదని ఆయన వాదించారు.


అలాగే వ్యూహం చిత్రం ఏమీ డాక్యుమెంటరీ కాదని, సినిమా తెరకెక్కించడంలో కళాకారులకు స్వేచ్చ ఉంటుందని తెలియజేశారు. అది కళాకారులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వారి హక్కులను కలరాయడం సరైంది కాదని పేర్కొన్నారు. అయినా ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలు ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదని పేర్కొన్న నిరంజన్ రెడ్డి.. సుప్రీమ్ కోర్టు చెప్పిన విధంగా ఇక్కడ పిటిషన్ వేసే అర్హత లేదని పేర్కొన్నారు. సినిమాలకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెటే ఫైనల్ అని గట్టిగా వాదించారు.  వ్యూహం సినిమా రిలీజ్ కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. 29న విడుదల కావాల్సి ఉండగా.. నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.