CM Ramesh  huge donation to the Congress party is becoming controversial  :  తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేష్ బీజేపీలో చేరారు.  ప్రస్తుతం ఎంపీగానే కొనసాగుతున్నారు. వచ్చే నెలలో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. మరోసారి ఎంపీగా  ఎన్నికవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆయన రాజకీయాల్లో డబుల్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వెలుగులోకి వచ్చిన ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ఇది బయటపడింది .                           
 రిత్విజ్ ప్రాజెక్ట్స్  పేరుతో కాంట్రాక్టులు చేస్తున్న సీఎం రమేష్         


సీఎం రమేష్ స్వతహాగా కాంట్రాక్టర్. ఆయనకు రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన బంధువులు ఈ కంపెనీని చూసుకుంటున్నారు. ఇటీవల ఆయన కుమారుడు కూడా కీలక బాధ్యతల్లోకి వచ్చారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన సీఎం రమేష్ బీజేపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునేవారని చెబతూంటారు. తెలుగుదేశం పార్టీ అధఇకారంల ఉన్నప్పుడు ఏపీలో పలు రకాల ప్రాజెక్టులు చేపట్టారు. ఏపీ కన్నా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ పనులు చేపడుతూ ఉంటారు.


కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు భారీ విరాళం                                        


బీజేపీ ఎంపీలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయి విరాళం ఇవ్వడం చూస్తామా ?. కానీ సీఎం రమేష్‌ను చూడాల్సిందే.  సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు . వాటిని కాంగ్రెస్ ఎన్ క్యాష్ చేసుకుంది. అలాగే మరో కర్ణాటక పార్టీ అయిన జేడీఎస్ కు కూడా   పది కోట్ల రూపాయలన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆయన మాతృపార్టీ. ఆ పార్టీకి కూడా ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.


సీఎం రమేష్ విరాళాల గుట్టు రట్టు - టిక్కెట్ పై ప్రభావం ?                          


సీఎ రమేష్ .. వ్యాపారవేత్త. ఆయన అన్ని ప్రభుత్వాలతోనూ ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలకు ఆయన వివరాళివ్వడం ఆశ్చర్యకరంగా మారింది. బీజేపీలోనూ ఇది చర్చనీయామయింది. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసేలా బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించడం వెనుక  సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన అనకాపల్లి నుంచి ఎన్నికల బరిలో నిలవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ బాండ్ల వివరాలు బయటకు రావడంతో ఆయన కు టిక్కెట్ ఇవ్వడంపై పార్టీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.