Cm Jagan Tour : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) అనంతపురం (Anantapuram) జిల్లాలో పర్యటించనున్నారు. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల(Ysr Asara Funds )ను విడుదల చేయనున్నారు. రూ.6,394.83 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం రూ.19,176 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని...78 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ది చేకూరింది. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. అక్కడి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద నిధులను...బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో చేయనున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా మహిళలకే రూ. 2,66,772.55 కోట్లు లబ్ది చేకూర్చింది వైసీపీ ప్రభుత్వం.
ఏ యే విడతల్లో ఎంత విడుదల చేశారంటే...
వైఎస్సార్ ఆసరా మైలు రాళ్లు
మొదటి విడత, 11 సెప్టెంబర్ 2020
77,87,295 మంది లబ్దిదారులకు రూ.6,318.76 కోట్లు విడుదల
రెండవ విడత, 07 అక్టోబర్ 2021
78,75,539 మంది లబ్దిదారులకు రూ.6,439.52 కోట్లు లబ్ది
మూడవ విడత, 25 మార్చి 2023
78,94,169 లబ్దిదారులకు రూ.6,417.69 కోట్లు విడుదల
నాల్గవ విడత, 23 జనవరి 2024
78,94,169 మంది లబ్దిదారులకు రూ.6,394.83 కోట్లు ఆర్థికసాయం
మూడు విడతల్లో ఇప్పటి వరకు విడుదల చేసిన మొత్తం రూ.19,176 కోట్లు
బుధవారం తిరుపతిలో పర్యటనకు జగన్
మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్ పాల్గొననున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొని.. అనంతరం ఆయన తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం జగన్ తిరుపతి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.