Jagan Daughter Harsha :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తె యెదుగూరి సందింటి హర్షిణి రెడ్డి ఫ్రాన్స్‌లోని ఇన్‌సీజ్ బిజినెస్‌ స్కూల్లో మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ , ఆయన సతీమణి భారతి రెడ్డి  ప్యారిస్ వెళ్లారు. ఈ కార్యక్రమం శనివారం జరిగింది. గ్రాడ్యూయేషన్ సెర్మనీ పూర్తయిన తర్వాత  సీఎం జగన్ తన కుమార్తె సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.  





హర్షిణి రెడ్డి మొదట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌లో మరో అత్యున్నతమైన యూనివర్శిటీ అయిన ఇన్‌సీడ్‌లో మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరారు.  కరోనా మొదటి విడత లాక్ డౌన్ పూర్తయిన తర్వాత విమాానాల రాకపోకలు పరిమితంగా ప్రారంభమైన సమయంలో ప్రత్యక్షంగా తరగతులు వినేందుకు హర్షిణి రెడ్డి ప్యారిస్ వెళ్లారు. సీఎం జగన్ బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చి వచ్చారు.  ఇప్పుడు గ్రాడ్యూయేషన్ పూర్తి కావడంతో ఆ వేడుకల్లో .. కుమార్తె సంతోషాన్ని పంచుకునేందుకు వెళ్లారు. 


గత నెలలో జగన్ సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి కూడా అమెరికాలోని ఓ యూనివర్సిటీలో  గ్రాడ్యూయేషన్  పూర్తి చేశారు. ఈ  కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చి అమెరికా వెళ్లారు. షర్మిలతో పాటు విజయమ్మ కూడా వెళ్లారు. అప్పట్లో షర్మిల తన అనందాన్ని ఇప్పుడు సీఎం జగన్ పంచుకున్నట్లే ట్వీట్ ద్వారా పంచుకున్నారు.