CM Jagan On Health Review : వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, ఆరోగ్య శ్రీ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.నాడు–నేడుతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న పనుల ప్రగతిపై అదికారులు సీఎం కు నివేదిక అందించారు. ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేయాలి, ఆరోగ్య శ్రీలో పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీకి పేషెంట్లను రిఫర్‌చేసే విధానం బలోపేతంగా ఉండాలి,రి ఫరల్ విధానాన్ని పర్యవేక్షణ ఉండాలి, విలేజ్ క్లినిక్స్ లో రిఫరల్ కోసం పర్మినెంట్ ప్లేస్‌ను డిజైన్ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్స్ అన్నవి రిఫరల్ కేంద్రాలుగా పనిచేస్తాయి,ఎక్కడికి రిఫరల్ చేయాలన్నదాని పై హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడ పూర్తి సమాచారాన్ని ఉంచాలన్నారు.
ఆరోగ్యశ్రీ అందుకున్న తర్వాత లబ్ధిదారులకు లేఖ అందాలి, పథకం ద్వారా తనకు అందిన లబ్ధిని అందులో పేర్కొనాలని జగన్ ఆదేశించారు. ఆరోగ్య శ్రీ లో ఆస్పత్రి నుంచి పేషెంట్ బయటకు వెళ్తున్నప్పుడు తనకు అందిన వైద్య సేవలపై కన్ఫర్మేషన్ తీసుకోవాలన్నారు.పేషెంట్ తిరిగి కోలుకున్నంత వరకూ అందిస్తున్న ఆరోగ్య ఆసరా విషయాలు కూడా కన్ఫర్మేషన్ పత్రంలో ఉండాలని, ఆరోగ్య ఆసరా డబ్బు నేరుగా వారి వ్యక్తి గత ఖాతాకు డీబీటీ విధానంలో చేస్తున్న పద్ధతిని కొనసాగించాలన్నారు. ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతాలను తెరచి,ఆరోగ్యశ్రీ కింద అందించే డబ్బును నేరుగా ఖాతాకు పంపాలన్నారు. ఈ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వైద్యం అందించిన ఆస్పత్రికి వెళ్లాలని పేర్కొన్నారు. ఈ మేరకు కన్సెంట్ పత్రాన్ని పేషెంట్ నుంచి తీసుకోవాలి, తన వ్యక్తిగత ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక అకౌంట్ వినియోగపడుతుందన్నారు.
ఈ విధానాల వల్ల పారదర్శకత వస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. తనకు చేసిన వైద్యం, ప్రభుత్వం నుంచి అందిన సహాయం, అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు అంతా కూడా పారదర్శకంగా ఉంటాయని జగన్ అన్నారు.మరింత జవాబు దారీతనం, పారదర్శకత వస్తుందని,రోగి పై అదనపు భారాన్ని వేయకుండా, వారికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలందే పరిస్థితి వస్తుందనిన జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఆరోగ్య మిత్రలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని,ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలకు ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుందన్నారు.ఇందుకు అదనంగా డబ్బు వసూలు చేసే పరిస్థితి ఉండకూడదని తెలిపారు.
ఒకవేళ ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాయన్న సంకేతం వెళ్లాలని జగన్ ఆదేసించారు. అదనంగా తన వద్ద నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న కన్ఫర్మేషన్ పేషెంట్ నుంచి తీసుకోవాలని సూచించారు.ఏమైనా ఫిర్యాదులు ఉంటే.. ఏ నెంబరుకు కాల్ చేయాలన్న విషయం కూడా పేషెంట్‌కు తెలియ చేయాలన్నారు.ఆరోగ్య మిత్రలు క్రియాశీలంగా వ్యవహరించేలా చూడాలన్నారు.పేషెంట్ అస్పత్రిలో చేరిన దగ్గరనుంచీ డిశ్చార్జి అయ్యేంత వరకూ అండగా, తోడుగా నిలవాలనిన జగన్ ఆదేశించారు.