ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వుం శుభవార్త తెలిపింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తు్న్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించగా..అంతర్ జిల్లాల బదిలీల్లో స్పాస్, మ్యూచువల్ బదిలీలకు వీలు కల్పించారు.


ఇక జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే రెండేళ్లు పూర్తి అయ్యి ప్రొబేషన్ డిక్లేరైన వాళ్లు బదిలీలకు అర్హులవుతారు. ఈ బదిలీల్లో ఎలాంటి పైరవీలకు తావులేకుండా జరుగుతాయని స్పష్టం చేసింది. బదిలీల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని సీఎం ఆఫీస్ నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.


జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించారు. అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన సీఎంకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


త్వరలో 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు..
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ పచ్చజెంగా ఊపారు. కాగా బుధవారం (మే 25) ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. 


దాదాపు వెయ్యికి పైగా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. వీటిలో గ్రూప్-1 పరిధిలో 100 పోస్టులు, గ్రూప్-2 పరిధిలో 900 పోస్టులకు పైగా ఉండే అవకాశం ఉంది. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుందని పేర్కొన్నారు.


Also Read:


గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ, యథావిథిగా జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష
తెలంగాణలో జూన్ 11న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్- టీఎస్పీఎస్సీ జూన్ 11వ తేదీన నిర్వహించ తలపెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను వాయిదా వేయాలని కోరుతు హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే గురువారం ఉదయమే రిట్ పిటిషన్ జస్టిస్ కె. లక్ష్మణ్ తో కూడిన హైకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. కాగా, తన కుమార్తె కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల రాసినందున తాను పిటిషన్ ను విచారించలేనని జస్టిస్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. పిటిషన్ ను మధ్యాహ్నం మరో బెంచ్ కు పంపిస్తానని వివరించారు. లంచ్ తర్వాత జస్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ వెళ్లగా విచారణ జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..